బుక్ మై షోలో 'భోళా' మేనియా ఇలా.. 'బ్రో' కంటే బెటరే..

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండి సందడి మాములుగా ఉండదు.

 Bhola Shankar In Mania Book My Show, Book My Show, Bro Movie, Bhola Shankar, Me-TeluguStop.com

మరి ఈసారి కూడా మెగాస్టార్ లేటెస్ట్ మూవీపై అంచనాలు మాములుగా లేవు.చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘భోళా శంకర్”.

మరో రెండు వారాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మరి రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో వేగం పెంచేస్తున్నారు.

మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ లభించాయి.

దీంతో ఈ సినిమాపై ప్రస్తుతం డీసెంట్ బజ్ అయితే నెలకొంది.

ఇక ఈ సినిమా 10 రోజుల సమయం ఉండగా ఇప్పుడే భోళా మేనియా కనిపిస్తుంది.బుక్ మై షో లో భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) తాజాగా లక్ష ఇంట్రెస్ట్స్ ను రిజిస్టర్ చేసి భోళా మేనియా రుజువు చూసింది.ఇది ఇటీవలే రిలీజ్ అయిన బ్రో కంటే బెటర్ రెస్పాన్స్ అనే చెప్పాలి.

మరి భోళా శంకర్ కోసం మెగా ఫ్యాన్స్ బాగానే ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర( Anil Sunkara ) ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.మరి రిలీజ్ తర్వాత ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube