బెంగుళూరులో వెలసిన 'భారతి పే'... ఏపీ ముఖ్యమంత్రికి కౌంటర్!

మీరు విన్నది నిజమే.మరి బెంగుళూరుకి ఏపీ ముఖ్యమంత్రికి వున్న సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో రాత్రికి రాత్రే కొన్ని పోస్టర్లు వెలిశాయి.‘పే సీఎం’ పేరుతో ఈ పోస్టర్లు అక్కడ హల్ చల్ చేయడం గమనార్హం.పైగా దానిమీద 40% కమిషన్ తీసుకోబడును.అని అందులో పేర్కోవడం కొసమెరుపు.

 'bharti Pay' Released In Bangalore Counter To Ap Chief Minister, Banglore, Bhar-TeluguStop.com

క్యూఆర్ కోడ్ ప్లేసులో సీఎం భార్య ఫొటోని వుంచారు.అయితే ఈ పోస్టర్లు ఎవరు తయారు చేయించారన్నదానిపై మాత్రం ఇంకా సమాచారం తెలియాల్సి వుంది.

అయితే ఆ పోస్టర్లను మొత్తం తాజాగా తొలగిస్తున్నట్లు ప్రకటించిన పోలీస్ ఉన్నతాధికారులు, పబ్లిక్ అప్పీయరెన్స్ మీద దెబ్బ తీసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ‘భారతి పే’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరుతో ‘భారతి పే’ అంటూ పోస్టర్లు రూపొందించారు కొందరు.

‘ఇచ్చట లిక్కర్ సొమ్ము తీసుకోబడును.’ అని అందులో పేర్కొన్నారు.

Telugu Banglore, Bharat Pay, Latest-Political

దానికి YS భారతి ఫొటోని క్యూ ఆర్ కోడ్ స్థానంలో పొందుపరిచారు.గత కొంతకాలంగా రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకి సంబంధించి YS భారతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.అందుకు ప్రతిగా TDP అధినేత చంద్రబాబు సతీమణిపైనా, చంద్రబాబు కోడలిపైనా YCP నేతలు తీవ్రస్థాయి దూషణలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే ‘భారతి పే’ అంటూ టీడీపీ ఈ కొత్త ర్యాగింగ్‌కి తెరలేపినట్లు తెలుస్తోంది.

మరి, ఈ పోస్టర్ల వ్యవహారంపై ఏపీ పోలీస్ స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube