ఇన్స్టాగ్రామ్ యూజర్స్ శుభవార్త... ఇది మీకోసమే!

ప్రపంచ ఫోటో షేరింగ్ దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేకత, ఆదరణ గురించి చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో దీనికి ఫాలోవర్లున్నారు.

 Good News Instagram Users This Is For You, Instagram, Users, Good News, Technolo-TeluguStop.com

ఇప్పుడు దీని మాతృసంస్థ మెటా ఇంకా కొత్త వినియోగదారులను ఆకర్శించడంకోసం ఓ సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది.ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలం నుంచి నిరీక్షిస్తున్నారు.

ఈ ఫీచర్ సహాయంతో ఇన్‌స్టా యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని మరింత సులభంగా చేయవచ్చు.ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఒకసారి 60 సెకన్ల స్టోరీని ఒక స్లైడ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.

ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు.ఇన్‌స్టాలో పోస్టర్ల కంటే ఎక్కువగా స్టోరీల్ని ఇష్టపడుతుంటారు.ఇప్పటి వరకూ ఒక స్టోరీ కేవలం 15 సెకెన్ల నిడివి మాత్రమే ఉండేది.వీడియో వ్యవధి ఎక్కువగా ఉంటే ఒక స్లైడ్‌లో 15 సెకన్లే వచ్చేది.

అయితే తాజా అప్డేట్ తో 60 సెకన్ల వరకూ అప్‌లోడ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ఎప్పుడు , ఏయే దేశాల్లో లాంచ్ కానుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఇన్‌స్టీ రీల్ కూడా ఇటీవల 90 సెకన్ల నిడివి పెంచిన విషయం అందరికీ తెలిసిందే.

Telugu Ups-Latest News - Telugu

అలాగే ఇటీవల ఇన్స్టా తెచ్చిన అప్డేట్ గురించి విన్నారా? నేడు ముఖ్యంగా మహిళలకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయి.వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలుగా కొందరు కేటుగాళ్లు మార్చుతున్నారు.ఈ తరుణంలో మహిళల భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

యూజర్ సేఫ్టీ ఫీచర్‌ను అభివృద్ధి చేయడంలో పని చేస్తోంది.ఇది యూజర్లు వారి డైరెక్ట్ మెసేజ్‌లలో నగ్న ఫోటోలను స్వీకరించకుండా కాపాడుతుంది.

సోషల్ మీడియా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్‌లో అంతరాన్ని తొలగిస్తుండగా, ఇది జనాలను వేధించకుండా కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube