ఆపిల్ సైడర్ వెనిగర్ - ఒక ఔషధ నిధి

ఆపిల్ సైడర్ వెనిగర్ .బాహుషా ఇది చాలామందికి తెలియని పదం.

 Benefits Of Apple Cider Vinegar-TeluguStop.com

కాని దీన్ని ఔషధ నిధిగా అభివర్ణిస్తారు చాలామంది డాక్టర్లు.సహజసిద్ధమైన రీతిలో, ఆపిల్ ద్వారా తయారు చేసే ఆపిల్ సైడర్ వెనిగర్ మన శరీరానికి ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది.

చాలా చవకగా దొరికే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగాలు ఏంటో చదివి తెలుసుకోండి.

* ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక సహజమైన క్లీన్సర్ గా పనిచేస్తుంది.జిడ్డుతో ఉన్న చర్మాన్ని దీనితో శుభ్రం చేసుకోవచ్చు.దీనితో దంతాలని కూడా శుభ్రం చేయవచ్చు.

నిజానికి టూత్ పేస్ట్ కంటే మెరుగైన ఫలితాలు మనం ఆపిల్ సైడర్ వెనిగర్ ద్వారా పొందవచ్చు.ఎలాంటి బ్యాక్టీరియాతో అయినా పోరాడే శక్తి దీనిలో ఉంటుంది.

* బ్లడ్ షుగర్ లెవెల్స్ కి చెక్ పెట్టడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చాలా పరిశోధనలు తెలిపాయి.రోజూ పడుకునే ముందు 2-3 స్పూనుల ఆపిల్ సైడర్ వెనిగర్ తాగండి.

* జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఆండ్ ఫుడ్ కెమిస్ట్రీ అధ్యయనాల ప్రకారం, కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మాత్రమే కాదు, కొలెస్టరాల్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

* ఆపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం పాళ్ళు ఎక్కువ.

బలం కోసం కెమికల్స్‌ మీద ఆధారపడే బదులు దీన్ని ఆశ్రయిస్తే మేలు.ఇందులో ఉండే అమినో ఆసిడ్స్ మీకు శక్తిని ఇస్తాయి.

* మెటిమలు, మచ్చలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ ని కాటన్ తో అప్లై చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.ఇది యాంటి బ్యాక్టీరియా గా పనికివస్తుంది.

దీనికి నెచురల్ టోనర్ అనే బిరుదుని కూడా ఇచ్చింది మెడికల్ ప్రపంచం.

* నోటి దుర్వాసనతో బాధపడేవారు కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ ని వాడితే ఉపయోగం ఉంటుంది.

ముందు చెప్పుకున్నట్లుగా, ఇది యాంటి బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది.నోటిని శుభ్రపరిచి, మంచి శ్వాసను అందిస్తుంది.

* శరీరంలో ఉన్న మలినాలు, టాక్సిన్స్ ని క్లిన్ చేయడం ఆపిల్ సైడర్ వెనిగర్ కి బాగా తెలిసిన విద్య.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube