సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ గుర్తింపు పొందినటువంటి వారిలో మౌనిక రెడ్డి ( Mounika Reddy ) ఒకరు.ఈమె యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి నటించిన వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సక్సెస్ అయినటువంటి ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు దీంతో పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) హీరోగా నటించిన భీమ్లా నాయక్ ( Bheemla Nayak ) సినిమాలో పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ గా పోలీస్ పాత్రలో నటించారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు అందుకున్నటువంటి మౌనిక అనంతరం సినిమాలపరంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.అయితే ఈమె ప్రేమించినటువంటి వ్యక్తితో గత ఏడాది ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే.గోవాలో ఎంతో ఘనంగా మౌనిక రెడ్డి సందీప్( Sandeep ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఈమె కూడా సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటిని డిలీట్ చేయడంతో విడాకులు( Divorce ) తీసుకోవడానికి సిద్ధమైంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
మౌనిక రెడ్డి కూడా సమంత నిహారిక బాటలోనే విడాకులకు సిద్ధమవుతుందంటూ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా( Social media )లో పెద్ద ఎత్తున వీరి విడాకుల వార్తలు వైరల్ కావడంతో ఎట్టకేలకు ఈ వార్తల పై మౌనిక రెడ్డి అలాగే ఆమె భర్త స్పందించారు.ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాం.మా పీఆర్ మంచి పనిచేశాడు.సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు పెట్టాలో మాకు తెలీదు.మా ప్రైవేట్ లైఫ్ మాది అంటూ ఆమె ఈ సందర్భంగా విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది.వీరిద్దరూ విడాకులు తీసుకోలేదని తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు.