ఏషియన్ గేమ్స్ విషయంలో తన నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ..!

ఈ ఏడాది ఏషియన్ గేమ్స్( Asian Games ) కు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది.సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ఏషియన్ గేమ్స్ ప్రారంభం అవ్వనున్నాయి.ఆసియా క్రీడలలో ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే క్రికెట్ ను చేర్చారు.2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్ భాగం చేశారు.ఇప్పుడు సరికొత్తగా ఈ 2023లో కూడా ఆసియా క్రికెట్లో భాగం చేయనున్నారు.గతంలో ఆసియా క్రీడలలో చేర్చిన క్రికెట్లో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ వంటి క్రికెట్ జట్లు పాల్గొన్నాయి.

 Bcci Has Changed Its Decision Regarding The Asian Games , Asian Games, Bcci, Sri-TeluguStop.com

భారత జట్టు మాత్రం ఒక్కసారి కూడా పాల్గొనలేదు.అయితే గతంలో ఆసియా క్రీడలలో భారత క్రికెట్ జట్టు భాగం కాదని బీసీసీఐ తెలిపింది.

కానీ తాజాగా బీసీసీఐ( BCCI ) తన నిర్ణయాన్ని మార్చుకొని ఆసియా గేమ్స్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు, మహిళల జట్టు పాల్గొంటాయని ప్రకటించింది.ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్ లో జరగనుంది.భారత్లో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ ఆసియా క్రీడలకు భారత ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ జట్టు విషయానికి వస్తే సీనియర్ మహిళల జట్టునే బీసీసీఐ ఏషియన్ గేమ్స్ కు పంపించనుంది.జూన్ 30లోపు బీసీసీఐ భరత జట్ల ఆటగాళ్ల జాబితాను భారత ఒలంపిక్ సంఘానికి పంపించనుంది.

వన్డే వరల్డ్ కప్ కు ముందే దాయాది దేశాలైన భారత్ -పాకిస్తాన్( India – Pakistan ) జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.ఆసియా కప్-2023 ఆగస్టు 31 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలగా జరగనుంది.మొత్తానికి ఈ ఏడాది వెస్టిండీస్ టూర్, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్, ఏషియన్ గేమ్స్ లతో క్రికెట్ అభిమానులకు పండుగే పండగ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube