MLA Danam Nagender : బస్తి దవాఖానాలు ఏర్పాటు చేసి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట వేశారు..ఎమ్మెల్యే దానం నాగేందర్

భారతదేశం లో ఎక్కడ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ cరావు బస్తి దవాఖానలు,హార్బన్ హెల్త్ కార్యాలయాలు బస్తీలలో ఏర్పాటు చేసి,ప్రజల ఆరోగ్యం పై పెద్దపీట వేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.ఖైరతాబాద్ లోని మక్తాలో ఏర్పాటు చేసిన క్యాటరాక్ట్ కంటి స్క్రీనింగ్ కేంద్రం, ఆశావర్కర్స్,ఏఎన్ఎమ్స్ లకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్,స్థానిక కార్పొరేటర్,డిఎం హెచ్ ప్రభుత్వ అధికారులతో కలసి పంపిణీ చేశారు.

 Basti Davakhanas Were Established And Kcr Gave A Big Boost To The Medical And He-TeluguStop.com

బస్తి దవాఖానాలు ఏర్పాటు చేసి అన్ని వైద్య పరీక్షల సదుపాయాలు ఏర్పాటు చేసి,ఎక్కడా వెళ్లకుండా బస్తీలోనే వైద్యం అందేవిగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కంటి చూపు కోల్పోయిన వృద్దులకు ఇంటివద్దకె ఆశావర్కర్లు వచ్చి వారిని తీసుకొని కావలసిన ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేసించి ఇంటివద్దనే వదిలిపెడుతున్నామని అన్నారు.రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం తో వైద్యశాఖలో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి పెనుమార్పులు తీసుకురాబోతున్నారని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube