బస్తి దవాఖానాలు ఏర్పాటు చేసి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట వేశారు..ఎమ్మెల్యే దానం నాగేందర్

భారతదేశం లో ఎక్కడ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ Cరావు బస్తి దవాఖానలు,హార్బన్ హెల్త్ కార్యాలయాలు బస్తీలలో ఏర్పాటు చేసి,ప్రజల ఆరోగ్యం పై పెద్దపీట వేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

ఖైరతాబాద్ లోని మక్తాలో ఏర్పాటు చేసిన క్యాటరాక్ట్ కంటి స్క్రీనింగ్ కేంద్రం, ఆశావర్కర్స్,ఏఎన్ఎమ్స్ లకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్,స్థానిక కార్పొరేటర్,డిఎం హెచ్ ప్రభుత్వ అధికారులతో కలసి పంపిణీ చేశారు.

/br.ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.

తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట వేశారని అన్నారు.

బస్తి దవాఖానాలు ఏర్పాటు చేసి అన్ని వైద్య పరీక్షల సదుపాయాలు ఏర్పాటు చేసి,ఎక్కడా వెళ్లకుండా బస్తీలోనే వైద్యం అందేవిగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కంటి చూపు కోల్పోయిన వృద్దులకు ఇంటివద్దకె ఆశావర్కర్లు వచ్చి వారిని తీసుకొని కావలసిన ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేసించి ఇంటివద్దనే వదిలిపెడుతున్నామని అన్నారు.

రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం తో వైద్యశాఖలో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి పెనుమార్పులు తీసుకురాబోతున్నారని అన్నారు.

దృశ్యంలో మీనా పాత్రను ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. అసలేం జరిగిందంటే?