పవన్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారట.. అదే జరగబోతుందంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొనిరావాలని కష్టపడుతుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం సీఎం కావాలని భావిస్తున్నారు.

 Bandla Ganesh Comments About Ap Cm Pawan Kalyan Goes Viral , Ys Jaganmohan Reddy-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ కు భక్తుడైన బండ్ల గణేష్ తాజాగా ఒక ఛానల్ కు హాజరై పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో పొలాల రేట్లు ఉన్నాయని తెలంగాణలో అమలవుతున్న పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయన అన్నారు.

కేసీఆర్ క్రమశిక్షణ వల్ల తెలంగాణ పరిస్థితి బాగుందని బండ్ల గణేష్ అన్నారు.తనకు ప్రస్తుతానికి రాజకీయాల గురించి అయితే ఆలోచన లేదని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.

నాకు సినిమాలు తీయడమంటే ఇష్టమని ఆయన వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎంగా చూడాలని తన కోరిక అని బండ్ల గణేష్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు ఆయనతో సినిమా తీస్తానని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.పవన్ ను తనకు సినిమా చేయాలని చెప్పి ఇబ్బంది మాత్రం పెట్టనని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ నాకు లైఫ్ లో చాలా చేశారని నా స్థాయికి మించి ఆయన నాకు సహాయం చేశారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Telugu Ap Cm, Bandla Ganesh, Pawan Kalyan-Movie

పవన్ తనతో సినిమా తీయకపోయినా ఆయన ఏపీకి ఉపయోగపడాలని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.పవన్ గురించి తాను ప్రిపేర్ కానని మనసులో ఏం ఉందో అదే చెబుతానని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.ఏపీలో తాను రాజకీయాలు చేయనని పవన్ కచ్చితంగా సీఎం అవుతారని తన ఆశ అని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube