పవన్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారట.. అదే జరగబోతుందంటూ?
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొనిరావాలని కష్టపడుతుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం సీఎం కావాలని భావిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కు భక్తుడైన బండ్ల గణేష్ తాజాగా ఒక ఛానల్ కు హాజరై పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఊహించని స్థాయిలో పొలాల రేట్లు ఉన్నాయని తెలంగాణలో అమలవుతున్న పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయన అన్నారు.
కేసీఆర్ క్రమశిక్షణ వల్ల తెలంగాణ పరిస్థితి బాగుందని బండ్ల గణేష్ అన్నారు.తనకు ప్రస్తుతానికి రాజకీయాల గురించి అయితే ఆలోచన లేదని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.
నాకు సినిమాలు తీయడమంటే ఇష్టమని ఆయన వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎంగా చూడాలని తన కోరిక అని బండ్ల గణేష్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు ఆయనతో సినిమా తీస్తానని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.
పవన్ ను తనకు సినిమా చేయాలని చెప్పి ఇబ్బంది మాత్రం పెట్టనని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ నాకు లైఫ్ లో చాలా చేశారని నా స్థాయికి మించి ఆయన నాకు సహాయం చేశారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
"""/"/
పవన్ తనతో సినిమా తీయకపోయినా ఆయన ఏపీకి ఉపయోగపడాలని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
పవన్ గురించి తాను ప్రిపేర్ కానని మనసులో ఏం ఉందో అదే చెబుతానని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.
ఏపీలో తాను రాజకీయాలు చేయనని పవన్ కచ్చితంగా సీఎం అవుతారని తన ఆశ అని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.
నీకు అదృష్టం బాగా ఉనట్లుంది.. కాస్త అటు ఇటైనా ప్రాణాలు పోయేవిగా (వీడియో)