మరో సర్జరీ చేయించుకున్న బాలయ్య.. అసలు ఆయనకు ఏమైంది.. వరుస సర్జరీలు?

టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే అఖండ సినిమాతో మంచి విజయం అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నారు.

 Balakrishna Undergoes Knee Surgery Bala Krishna, Tollywood, Knee Surgery, Akhand-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.అఖండ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక చిన్న ప్రమాదం కారణంగా బాలయ్య కుడిభుజం కు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.

తాజాగా మరొకసారి బాలయ్యకు శస్త్రచికిత్స నిర్వహించారు.బాలయ్య బాబు గత కొద్దిరోజులుగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో మరొకసారి వైద్యులు బాలకృష్ణ మోకాళ్ల నొప్పికి శస్త్రచికిత్సను చేశారట.అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలయ్య బాబు కి మళ్ళి ఏమయింది అని తెగ టెన్షన్ పడిపోతున్నారు.

బాలయ్యబాబు ఆరోగ్యంపై స్పందించిన ఆ వైద్యులు బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీయే అనే భయపడాల్సిన పని లేదని, ప్రస్తుతం బాలయ్య బాబు ఆరోగ్యం బాగానే ఉంది అని వైద్యులు తెలిపారు.

Telugu Akhanda, Bala Krishna, Knee Surgery, Sruthi Hassan, Tollywood-Movie

అయితే కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని వైద్యులు సూచించారు.ఇక బాలయ్య శస్త్రచికిత్స జరిగిన తరువాత హాస్పిటల్ వైద్యులతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫోటోను చూసిన అభిమానులు బాలయ్య బాబు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

బాలయ్య సర్జరీ కారణంగా గోపీచంద్ మలినేని షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా పడనుంది.అయితే కొద్దిగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత బాలయ్య బాబు షూటింగ్ లో పాల్గొన బోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube