పవన్, బాలయ్య, చరణ్.. ఒకే వేదికపై స్టార్స్.. స్నాప్ వైరల్!

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం( Brahmanandam ) అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.అంతగా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

 Balakrishna And Pawan Kalyan Attend Brahmanandam's Son Siddharth's Wedding Recep-TeluguStop.com

అయన సినిమాలు చూస్తే ఎంత బాధలో ఉన్నా వారు అయినా కూడా అయన కామెడీ చూస్తు ఆ కాసేపు అన్నీ టెన్షన్స్ మరిచిపోయి హాయిగా సినిమాని ఎంజాయ్ చేస్తాం.అయితే ఈయనను చాలా రోజుల నుండి ఆడియెన్స్ మిస్ అవుతున్నారు.

గత కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులు ఆయన కామెడీని మిస్ అవుతున్నారు.బ్రహ్మానందంకు ఆరోగ్యం సరిగ్గా లేక పోవడంతో కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.ఇక ఈ మధ్యనే కొన్ని సినిమాలో కనిపించారు.ఇప్పుడు మరి కొన్ని సినిమాలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మ్రోగాయి.

ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్, ఐశ్వర్యల( Siddharth ) వివాహం ఘనంగా జరిగింది.ఈ వివాహంకు టాలీవుడ్ ప్రముఖులు సినీ, రాజకీయ నాయకులూ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.సిద్ధార్థ్ పెళ్లి డాక్టర్ ఐశ్వర్యతో జరిగింది.

మరి ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించి సందడి చేసారు.ఈ పెళ్ళికి రాజకీయ ప్రముఖులే కాదు.

సినీ స్టార్స్ తరలి వచ్చారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) లు వీరి పెళ్లి వేడుకలో హాజరయ్యారు.

పెళ్లి వేడుక నుండి ఈ పిక్స్ అన్ని బయటకు వచ్చి మంచి వైరల్ గా మారాయి.అందరి స్టార్స్ ను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ తృప్తి చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube