మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati )గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి ఒక్కసారిగా నిశ్చితార్థం చేసుకోబోతున్నాము అంటూ అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.
అయితే త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది అంటూ వరుణ్ తేజ్ పెళ్లి(Marriage) గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున( Gandeevadari Arjuna ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు ఈయన హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి అలాగే తన పెళ్లి తేదీ గురించి కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన పెళ్లి తేదీ( Marriage Date) ఇంకా ఫిక్స్ కాలేదని తెలిపారు.
తన వివాహం నవంబర్ లేదా డిసెంబర్లో జరగబోతుందని ఈయన తెలియజేశారు.అయితే తన పెళ్లి తేదీని ఫిక్స్ చేసేది మా అమ్మేనని అంతా తన చేతుల్లోనే ఉందని వరుణ్ తేజ్ వెల్లడించారు.
ఇక తన వివాహం ఎక్కడ జరగబోతుంది అనే విషయాల గురించి కూడా ఈయన తెలిపారు.
తాను ప్రవేట్ గా తన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.హైదరాబాదులో అలా చేసుకోవడం వీలు కాదు అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నానని ఇండియాలో మూడు ప్లేస్లు సెలెక్ట్ చేసామని ఫారెన్ లో రెండు ప్లేసులు సెలెక్ట్ చేసామని తెలిపారు.అయితే ముందు పెళ్లి తేది ఫిక్స్ అయిన తర్వాత ప్లేస్ ఎక్కడ అనే విషయాలను సెలెక్ట్ చేస్తాము అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరగబోతుందనే విషయాల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.