ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేపీ చౌదరి( KP Chowdary ) డ్రగ్స్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కేపీ చౌదరిని విచారించిన పోలీసులు అతని ఫోన్ కాల్స్, కాంటాక్ట్ లిస్ట్, ఫొటోలను బట్టి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ కేసులో చాలా మంది సెలెబ్రెటీల పేర్లు బయటికి వచ్చిన విషయం తెలిసిందే.తెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఇందులో స్పోర్ట్స్ పర్సన్స్ పేర్లు కూడా బయటికి వస్తున్నాయి.
ఈ కేసులో అనూహ్యంగా ప్రముఖ బ్యాట్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి( Sikki Reddy ) పేరు వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ విషయం కాస్త మరింత హాట్ టాపిక్ గా మారింది.
కేపీ చౌదరి ఫోన్ డేటాలో సిక్కిరెడ్డితో వందల కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.కృష్ణ ప్రసాద్ చౌదరిని అరెస్టు చేసే సమయంలోనే బ్యాట్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి ఇంట్లో పార్టీ ఇచ్చినట్లుగా కేపీ పోలీసులకు తెలిపారు.
కాగా ప్రస్తుతం సిక్కిరెడ్డి మాత్రం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.సిక్కిరెడ్డితో కేపీ చౌదరి మాట్లాడి ఆమె ఇంట్లో లేని సమయంలోనే డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఈ డ్రగ్స్ పార్టీలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పోలీసులు సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీల నిర్వహణపై కూపీ లాగుతున్నారు.అంతే కాకుండా సిక్కిరెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు.అయితే ఈ వ్యవహారంపై సిక్కిరెడ్డి భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ ( Sumith ) స్పందించారు.
స్నేహిత హిల్స్‌లో ఫ్లాట్‌ని తమ పెళ్లికి ముందు గిఫ్ట్‌గా ఇచ్చారని.ఆ ఫ్లాట్ సిక్కిరెడ్డి పేరు మీద ఉందని వివరించారు.వేరే ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యే వరకు నాలుగు రోజులు తమ ఫ్లాట్ కావాలని కేపీ చౌదరి అడిగినట్టు చెప్పుకొచ్చారు.
ఎలాగో ఆ ఫ్లాట్‌లో తాము ఉండట్లేదు కదా అని కేపీకి ఇచ్చినట్టు చెప్పారు.ఆ ఫ్లాట్‌లో ఏం జరిగిందో తమకు మాత్రం తెలియదని.తాము రెస్పాన్సిబుల్ కూడా కాదని సుమిత్ తెలిపారు.
మరి కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి మరి.అయితే పోలీసులు అనుమానిస్తున్న విధంగా కేపీ చౌదరికి అలాగే సిక్కిరెడ్డికి సంబంధం ఉందా, లేదా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.మరి ఈ విషయంపై సిక్కిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.