ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే సినిమాలో నటిస్తా.. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య డిమాండ్ మామూలుగా లేదుగా..!!

వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaithanya ) ప్రస్తుతం యూత్ నోళ్లలో ఎక్కువగా మెదులుతున్న పేరు ఈ హీరోయిన్ దే.విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటుడు విరాజ్ ఇద్దరు ముఖ్యపాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Baby Movie Heroine Vaishnavi Chaithanya Shocking Conditions,vaishnavi Chaithanya-TeluguStop.com
Telugu Allu Arjun, Baby, Viraj-Movie

అంతే కాదు ఈ సినిమా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ని మించి హిట్ అయింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య ఇందులో చేసిన ఇద్దరు హీరోల కంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది.ఇక వైష్ణవి చైతన్య బేబీ ( Baby ) సినిమా కంటే ముందే యూట్యూబర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వెబ్ సిరీస్ లో చేసింది.

Telugu Allu Arjun, Baby, Viraj-Movie

ఇవేకాకుండా ఇంకో మరికొన్ని వెబ్ సిరీస్ లలో అలాగే షార్ట్ ఫిలిమ్స్ ఇక ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ ( Allu Arjun ) చెల్లెలిగా, వరుడు కావలెను అనే సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ లో నటించింది.ఇక వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించింది.

ఈ సినిమాతో ఓవర్ నైట్ లో వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్ లెవెల్ లోకి వచ్చింది.

అంతేకాదు ఈ హీరోయిన్ మొదటి సినిమానే హిట్ అవడంతో చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే చిరంజీవి వంటి స్టార్ హీరోలు ఈమెను పొగడడంతో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.అయితే ఇండస్ట్రీలో కాస్త స్టార్డం వస్తే కొంతమంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు.

Telugu Allu Arjun, Baby, Viraj-Movie

అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు అంటూ ఈ విషయం తెలిసిన కొంత మంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.ఎందుకంటే వైష్ణవి చైతన్య తన దగ్గరికి వచ్చిన దర్శక నిర్మాతలకు కొన్ని కండిషన్లు పెడుతుందట.తనకు ఒక్క సినిమాకు రెండు కోట్ల రెమ్యూనరేషన్( Vaishnavi Chaitanya Remuneration ) ఇవ్వాలని, అలాగే సైన్ చేసిన వెంటనే అడ్వాన్స్ కూడా తొందరగా ఇచ్చేయాలని, అలాగే నేను పెట్టిన డేట్స్ నే కన్ఫామ్ చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటే రాను అంటూ కొన్ని కండిషన్లు పెడుతుందట.

అయితే ప్రస్తుతం ఆమె పెట్టిన కండిషన్ ల గురించి సోషల్ మీడియాలో వినిపించడంతో చాలామంది నెటిజన్స్ వైష్ణవి చైతన్య డిమాండ్ మామూలుగా లేదుగా.

ఒక్క సినిమాతోనే పొగరు చూపిస్తుందిగా.అంటూ కామెంట్లు పెడుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube