సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) వైష్ణవి చైతన్య( Vaishnavi chaitanya ) కలిసి నటించిన తాజా చిత్రం బేబీ. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది తెలుగమ్మాయి హీరోయిన్ వైష్ణవి చైతన్య.
ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.టాలీవుడ్ లో అగ్ర హీరోలైనా చిరంజీవి అల్లు అర్జున్ లాంటి స్టార్ లు సైతం వైష్ణవి చైతన్య పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమా విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడతాయని, వైష్ణవి చైతన్యకు కూడా శ్రీ లీల మాదిరిగా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.ఈ సినిమా విడుదల తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోయింది.అలాంటిది ఇప్పుడు అసలు వైష్ణవి చైతన్య పేరే పెద్దగా వినిపించకపోవడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పుడే బేబీ హీరోయిన్ ని పక్కన పెట్టేశారా, సినిమా విడుదల తర్వాత వచ్చిన పొగడ్తలు అన్నీ కూడా బురదలోపోసిన పన్నీరేనా అంటూ ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోల్డ్ స్టోరీకి తోడు ఈమె యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది.దీంతో బోలెడన్ని కొత్త ఆఫర్లు వస్తాయని భావించింది.కానీ జరుగుతున్నది వేరు అనిపిస్తుంది.అయితే బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేన్ తీయబోయే రెండు కొత్త సినిమాల్లో వైష్ణవి హీరోయిన్ అనే టాక్ వినిపించింది.కానీ వీటికి ఇంకా చాలా టైముందని అంటున్నారు.అలానే రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్‌గా తీసుకున్నారని అన్నారు.
దీనిపై క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు.బేబీ మూవీ( Baby movie )లో తన క్యారెక్టర్ బోల్డ్ కావడం కూడా బడా నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రాకపోవడానికి కారణమేమో అని వైష్ణవిని కన్ఫ్యూజన్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది.
మరి వైష్ణవి నుంచి కొత్త సినిమా కబురు ఎప్పుడొస్తుందో ఏంటనేది చూడాలి మరి.