టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.తనను ఓడించడమే లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంపై వైసిపి ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో, కుప్పం నియోజకవర్గ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని బాబు డిసైడ్ అయ్యారు.2019 ఎన్నికల్లో మెజారిటీ కాస్త తగ్గడం, ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొనబోతుండడంతో కుప్పం పైన బాబు దృష్టి పెట్టి, ఇక్కడ తనకు తిరుగులేకుండా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ మేరకు ఈ రోజు , రేపు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించబోతున్నారు.ఈ మేరకు ఈరోజు 11.15 నిమిషాలకు బెంగళూరు హెచ్ ఏ ఎల్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి ఉదయం 11.25 నిమిషాలకు పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి హెలి ప్యాడ్ ఆవరణలోకి చంద్రబాబు చేరుకుంటారు.11: 40 నిమిషాలకు కొత్తపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కు చంద్రబాబు చేరుకుంటారు.మధ్యాహ్నం 12 గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ భవనానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12 నుంచి రెండు వరకు అక్కడే స్థానిక కుప్పం టిడిపి నాయకులతో సమావేశం అవుతారు.మధ్యాహ్నం ౦౨ నుంచి, 03 గంటల వరకు భోజనం విరామం తీసుకుని ,మధ్యాహ్నం 03 .20 నిమిషాల నుంచి కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణకు చేరుకుంటారు.మధ్యాహ్నం 3.20 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణకు చేరుకుంటారు.మధ్యాహ్నం 3.30 నిమిషాల నుంచి 5.30 నిమిషాల వరకు ఆర్టీసీ బస్టాండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు.సాయంత్రం 5.30 నిమిషాల నుంచి ఎన్టీఆర్ విగ్రహం, ఆర్టిసి బస్టాండ్ మీదుగా కె.వి.ఆర్ కళ్యాణ మండపం చేరుకుంటారు.సాయంత్రం 6 నుంచి 7:00 వరకు ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.7.20 నిమిషాలకు కె.వి.ఆర్ కళ్యాణమండపం చేరుకుంటారు.
రాత్రి 7.30 నుంచి 8.30 వరకు టిడిపి కార్యాలయం లో స్థానిక టిడిపి( TDP ) నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.రాత్రి 8.45 నిమిషాలకు టిడిపి కార్యాలయం నుంచి ఆర్ అండ్ బి అతిథి విశ్రాంతి గృహానికి చంద్రబాబు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.రేపు కూడా కుప్పం నియోజకవర్గంలోనే ( Kuppam constency )పర్యటిస్తారు.రేపు ఉదయం 10.5 నుంచి 11 నిమిషాల వరకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి కెవిఆర్ కళ్యాణ మండపానికి చేరుకుంటారు.ఉదయం 11 నుంచి 12.5 నిమిషాలకు చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపిలో చేరికలు జరుగునున్నాయి.మధ్యాహ్నం 12.50 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు కె.వి.ఆర్ కళ్యాణ మండపం నుంచి బాబు నగర్ లో క్యాంపెనింగ్.మధ్యాహ్నం 01 నుంచి 01 .30 నిమిషాల వరకు ఇంటింటికి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు .
మధ్యాహ్నం 1 .40 నుంచి 2.30 నిమిషాల వరకు విరామం తీసుకుంటారు.మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు.మధ్యాహ్నం 4.30 నిమిషాలకు రాజుపేట గ్రామం రామకుప్పం చేరుకుంటారు.సాయంత్రం 4.30 నుంచి 5.30 నిమిషాల వరకు హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలిస్తారు.సాయంత్రం ఐదు నుంచి 6 గంటల వరకు రాజుపేట నుంచి కుప్పం టిడిపి కార్యాలయానికి చేరుకుంటారు.సాయంత్రం 6 నుంచి 7.45 వరకు టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు .రాత్రి 7.45 నుంచి 8 గంటల వరకు ఆర్ అండ్ బి అతిథి విశ్రాంతి గృహానికి చేరుకుంటారు.రాత్రి 8 గంటలతో చంద్రబాబు కుప్పం పర్యటన ముగుస్తుంది.