‘‘గోల్డెన్ వీసా’’ స్కీమ్‌కు తెరదించిన ఆస్ట్రేలియా .. భారతీయులకు షాకేనా..?

ఆస్ట్రేలియా( Australia ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కీలకమైన ‘‘గోల్డెన్ వీసా’’ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

 Australia Scraps ‘golden Visa’ Programme For Wealthy Investors , Australia,-TeluguStop.com

ఈ కార్యక్రమం ఆశించిన ఆర్ధిక ఫలితాలను ఇవ్వడం లేదని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లించింది.దీనికి బదులుగా వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు తెలిపింది.

ఏంటీ గోల్డ్ వీసా :

విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు తమ దేశంలో నివసించేందుకు వీలుగా ఆస్టేలియా ప్రభుత్వం వీసాలను జారీ చేస్తుంది.ఆ దేశంలో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేవారు ఈ వీసాతో అక్కడ ఐదేళ్ల పాటు వుండొచ్చు.

విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.హోంశాఖ గణాంకాల ప్రకారం.ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది ఈ కార్యక్రమం కింద ఆస్ట్రేలియాలో రెసిడెన్సీని దక్కించుకున్నారు.వీరిలో 85 శాతం చైనా మిలియనీర్లే కావడం గమనార్హం.

Telugu America, Australia, China, Clare Oneil, Golden Visa, Goldenvisa, India, I

గడిచిన కొన్నేళ్లుగా ఈ స్కీమ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వీసాను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమంగా సంపదను తరలిస్తున్నారనే అభియోగాలు వినిపిస్తున్నాయి.వీటిని సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు మరిన్ని వీసాలు జారీ చేస్తామని ఆస్ట్రేలియా హోంమంత్రి క్లేర్ ఓ నీల్( Clare O’Neil ) ఓ ప్రకటనలో తెలిపారు.

ఆస్ట్రేలియా మాదిరిగానే కెనడా, బ్రిటన్, సింగపూర్‌లు కూడా గోల్డెన్ వీసాను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Telugu America, Australia, China, Clare Oneil, Golden Visa, Goldenvisa, India, I

అయితే గోల్డెన్ వీసాలను( Golden visa ) రద్దు చేయడం వల్ల భారతీయులపై ప్రభావం పడుతుందా అన్న అనుమానాలకు నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.ఆస్ట్రేలియాలో అమెరికా, యూకే జాతీయులు ప్రధాన పెట్టుబడిదారులు.ఆ తర్వాత బెల్జియం, జపాన్, సింగపూర్‌లు నిలిచాయి.

ఇందులో భారతదేశం 17వ స్థానంలో నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube