శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కొడుకుని నరికి చంపిన తండ్రి

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది.కని పెంచిన కొడుకుని పాశవికంగా నరికి చంపాడు ఓ కసాయి తండ్రి.

 Atrocious In Srikakulam District.. Father Hacked His Son To Death-TeluguStop.com

ఈ అమానుష ఘటన ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో చోటు చేసుకుంది.

అర్ధరాత్రి సమయంలో కొడుకు తాతారావుపై తండ్రి కొండ్రు కుప్పేసు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

నిద్రపోతున్న కుమారుడిని నరికి చంపాడు.దీంతో తీవ్రగాయాలపాలైన తాతారావు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.

అనంతరం మిగతా కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసేందుకు కుప్పేసు ప్రయత్నించాడని తెలుస్తోంది.కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్ అయ్యాడు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అదేవిధంగా హత్యపై కేసు నమోదు చేసి నిందితుడు కుప్పేసు కోసం గాలిస్తున్నారు.

అయితే హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube