ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధా( Extramarital affair )ల కోసం కట్టుబడి వివాహ బంధువులకు విలువ ఇవ్వకుండా దారుణాలకు పాల్పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ మహిళ ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన గుంటూరులోని లక్ష్మీ నగర్ లో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
గుంటూరు నగరం పాలెం సీఐ కె.మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం.కురిచేడు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన చిన్న కత్తి రామచంద్రయ్య (40) అనే వ్యక్తి గుంటూరులోని లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్నాడు.
రామచంద్రయ్య కూలీ పనులు చేస్తూ తన భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు.అయితే రామచంద్రయ్య భార్యకు, గుంటూరుకు చెందిన చిన్నా అనే వ్యక్తికు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని రామచంద్రయ్య భార్య అనుకుంది.భర్తను చంపేందుకు ఇద్దరు కిరాయి హంతకులతో రూ.1 లక్ష రూపాయలు బేరం కుదుర్చుకుంది.రామచంద్రయ్య మెడలో ఉండే బంగారు గొలుసులు తాకట్టు పెట్టి రూ.60000 అడ్వాన్స్ ఇచ్చింది.
కిరాయి గుండాలు రామచంద్రయ్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు.ఎక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.కానీ పందెం ప్రకారం ఇంకా రూ.40000 ఇవ్వాల్సివుంది.చిన్నాకు, కిరాయి గుండా శ్యామ్ కు మధ్య ఈ డబ్బు విషయంలో వివాదం మొదలైంది.
ఇక క్రమంగా హత్య విషయం బయటపడడంతో సీఐ కే.మల్లికార్జున కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులు పోలీసుల ముందు హత్య విషయం గురించి చెప్పేశారు.పోలీసులు రామచంద్రయ్య మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.