కాంగ్రెస్ లో విలీనం లేనట్టే ! షర్మిల పరిస్థితి ఏంటి ? 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( Sharmila )రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారింది.ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడం ,పార్టీలో పెద్దగా పేరున్న నాయకులు లేకపోవడం, చేరికలు పూర్తిగా నిలిచిపోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు.

 As If There Is No Merger In Congress What Is Sharmila's Condition , Ysrtp, Tel-TeluguStop.com

ఈ సందర్భంగా కొన్ని షరతులను కాంగ్రెస్ ( Congress )కు విధించగా వాటి విషయంలో అంత సానుకూలంగా కాంగ్రెస్ స్పందించకపోవడంతో,  చాలా రోజులుగా డైలమాలు ఉన్నారు .ముఖ్యంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఏపీ రాజకీయాలకే తనను పరిమితం కావాలని కాంగ్రెస్ పెద్దలు కోరుతుండడంపై షర్మిల అసంతృప్తితో ఉన్నారు.

Telugu Aicc, Dk Siva Kumar, Sharmila, Telangana, Ysrtp-Politics

 తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని,  పాలేరు నియోజకవర్గ టికెట్ తనకు కేటాయించాలని షర్మిల>( Sharmila ) డిమాండ్ వినిపించినా, కాంగ్రెస్ నుంచి అంతగా స్పందన రాలేదట.మరోవైపు చూస్తే కాంగ్రెస్ తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా దాదాపుగా ఫైనల్ చేసింది .మరి కొద్ది రోజుల్లోనే వాటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.దీంతో పాటు మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

దీంతో షర్మిల పార్టీ విలీన ప్రక్రియ ఇక లేనట్టే అనే విషయం అర్థమవుతుంది.దీంతో ఇప్పుడు ఆమె ఏ విధంగా రాజకీయ అడుగులు వేస్తారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

Telugu Aicc, Dk Siva Kumar, Sharmila, Telangana, Ysrtp-Politics

తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ( YSR Telangana Party )ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఒకవేళ ఆమె సొంతంగా తమ పార్టీ నుంచి పోటీ చేయడంతో పాటు , అభ్యర్థులను నిలబెట్టినా,  గెలుపు అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.అలా పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందితే రాబోయే రోజుల్లో షర్మిల రాజకీయ భవిష్యత్తుకు గండం పడుతుంది .తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినా ఆమె అనేక అవమానాలు,  విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై షర్మిల>( Sharmila ) అయోమయంలో పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube