ఫోన్ ట్యాపింగ్ : కేసీఆర్ కూ నోటీసులు ఇస్తున్నారా ? 

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ( Phone tapping )పెద్ద దుమారమే రేపుతోంది.బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులతో పాటు , బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది కీలక నేతల ఫోన్ లను ట్యాప్ చేసినట్లుగా బీఆర్ఎస్ ( BRS )అగ్ర నేతలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 Are You Giving Notices To Kcr For Phone Tapping, Phone Taping Issue, Brs Party,-TeluguStop.com

ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఇంటిలిజెన్స్ డిఐజి ప్రభాకర్ రావు తో పాటు, మరికొంతమంది అధికారులు ఈ కేసులో ఉన్నారు.తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు( Former DCP Radhakishan Rao ) సంచలన విషయాలను బయటపెట్టారు.

బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదలుపెట్టినట్లు ఆయన వివరించారు.2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డిఐజిగా నియమించింది.ఆ తరువాత ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా రాధా కిషన్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ రిపోర్ట్ లో ‘భీఆర్ఎస్ సుప్రీమో ‘ అని  ప్రత్యేకంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Telugu Kcr Phone, Brs, Congress, Dcp Radhakishan, Pcc, Phone, Revanth Reddy-Poli

అసలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు, సొంత పార్టీలోని కొంతమంది కీలక నేతల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేసేందుకే ప్రత్యేకంగా ప్రణీత్ రావును( Praneeth Rao ) ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రభాకర్ రావు తీసుకొచ్చారు అనే విషయాన్ని రాధా కిషన్ వివరించారు.ఆ తరువాత స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి, ప్రతిపక్ష నేతల ఫోన్లు టాప్ చేయడం వంటివి జరిగాయని, బీఆర్ఎస్ ను విభేదించిన నేతల కదలికలపైనా నిఘా పెట్టారని, బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు చట్ట విరుద్ధంగా పనిచేసినట్లు రాధా కిషన్ అంగీకరించారు.

Telugu Kcr Phone, Brs, Congress, Dcp Radhakishan, Pcc, Phone, Revanth Reddy-Poli

దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ అంగీకరించారు.ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయడం, బీఆర్ఎస్ డబ్బు తరలించే వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి, ఎటువంటి ఆటంకాలు లేకుండా పంపినట్లు రాధా కిషన్ వివరించారు.ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ రావు బంధువుకు చెందిన కోటి రూపాయలను సీజ్ చేసినట్లుగా వివరించారు.

అలాగే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల ఫోన్ లు టైపింగ్ చేసి, నగదును సీజ్ చేసినట్లుగా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.అయితే ఈ వ్యవహారం అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలను సిద్ధం చేసుకోవడంతో ఈ కేసులో కేసీఆర్ కు నోటీసులు అందే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube