ఫోన్ ట్యాపింగ్ కేసు( phone tapping case )లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పూర్తయింది.
భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసులు విచారించారు.కస్టడీ పూర్తి కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం వారిద్దరినీ నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.ఇదే కేసులో రాధాకిషన్ రావు( Radhakishan rao )ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.అదేవిధంగా ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన మెమోపై న్యాయస్థానం నిర్ణయం తెలపనుంది.కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారులు, రాజకీయ నేతల పేర్లు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.