శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్ పై అడ్వకేట్ కమీషన్ నియామకం

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్ పై అడ్వకేట్ కమిషన్ ను రాష్ట్ర హైకోర్టు నియమించింది.ఈ క్రమంలో ఈనెల 11వ తేదీ లోపు అడ్వకేట్ కమిషనర్ విచారణను పూర్తి చేయనున్నారు.

 Appointment Of Advocate Commission On Election Petition Of Srinivas Goud-TeluguStop.com

విచారణలో భాగంగా సాక్షుల విచారణతో పాటు ఆధారాలను అడ్వకేట్ కమిషనర్ పరిశీలించనున్నారని తెలుస్తోంది.సాక్షులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని ఈ మేరకు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా అడ్వకేట్ కమిషనర్ ముందు హాజరు అవ్వాల్సిందిగా సాక్షులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో 8వ తేదీన ప్రస్తుత మెదక్ జిల్లా ఆర్డీవో స్టేట్మెంట్ ను అడ్వకేట్ కమిషనర్ రికార్డ్ చేయనున్నారు.

అదేవిధంగా నల్గొండ అడిషనల్ కలెక్టర్ స్టేట్మెంట్ ను ఈనెల 11న రికార్డ్ చేయనున్నారు.అనంతరం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube