తిరుమల శ్రీవారిని ఏపీ టూరిజం శాఖామంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి వైసీపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
కొత్త జిల్లాల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.సీఎం జగన్ కు మరింత శక్తిని ఇవ్వాలని స్వామి వారిని ప్రార్ధింఛానని తెలిపారు.
కరోనా కారణంగా టూరిజం వెనకపడిందని, ఈ ఏడాది ఆశాజనంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఓం నమో వేంటేశాయ
.