ఏపీ పై కేంద్రం నిఘా ? రంగంలోకి కేంద్ర బృందాలు

ఏపీ సీఎం జగన్ పై రోజురోజుకు రాజకీయ విమర్శలు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 Ap, Corona Cases, Red Zone, Quarantine, Corona Situation-TeluguStop.com

లాక్ డౌన్ నిబంధనలను మరికొద్ది రోజుల్లో ఎత్తివేయనున్న నేపథ్యంలో ఏపీలో ఇంకా పరిస్థితులు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.అదీకాకుండా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని మరింత వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ప్రజలకు సాయం పేరుతో ప్రచారాలకు దిగుతుండడం, ఈ విషయాలు కేంద్రం దృష్టికి కూడా వెళ్లడంతో వైసిపి ప్రభుత్వంపై కేంద్రం గురు గానే ఉంది.తాము కఠినమైన మార్గదర్శకాలు విడుదల చేసినా, వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది.

ఈ నేపథ్యంలో వైరస్ నివారణ చర్యలను స్వయంగా పరిశీలించేందుకు కేంద్రం బృందాలను రంగంలోకి దించాలని నిర్ణయించారు.

నాలుగు రోజుల్లో ఈ బృందం ఏపీకి రాబోతున్నట్టు సమాచారం.

ఏపీలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి వైరస్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను ఆ బృందం పరిశీలించబోతోంది.వాస్తవంగా కేంద్ర బృందాలను మెట్రో సిటీలకు మాత్రమే పంపిస్తున్నారు.

హైదరాబాద్ కోల్ కతా, ముంబయి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ బృందాలు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి.బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కేంద్ర బృందానికి సహకరించకపోవడం వివాదం రేపుతోంది.

మిగతా చోట్ల ఈ బృందం పర్యటించేందుకు స్థానిక ప్రభుత్వాలు అన్ని ఏర్పాటు చేశాయి.

Telugu Corona, Quarantine, Red Zone-Telugu Political News

ఏపీలో మెట్రో సిటీ లు లేకపోయినప్పటికీ, ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతుండటం, లాక్ డౌన్ సక్రమంగా అమలు చేయడం లేదనే ఫిర్యాదులు కేంద్రానికి అందడంతో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగి పోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో పెద్ద ఎత్తున కేంద్రం నిధులు అందిస్తోంది.అయితే ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నరా లేదా ? క్వారంటైన్ సెంటర్లు , రెడ్ జోన్ లలో పరిస్థితులు ఏంటి అనే విషయంపై పూర్తిస్థాయిలో కేంద్ర బృందం దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube