YS Jagan : ఆ విధంగా ముందుకు వెళ్ళండి… పార్టీ శ్రేణులకు జగన్ సరికొత్త పిలుపు 

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త తరహాలో ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేసేందుకు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) పార్టీ కార్యక్రమాలకు శ్రీకరం చుట్టారు.ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ తో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని,  ఈ సమయాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామ సచివాలయాన్ని( Grama Sachivalayam ) సందర్శించి,  ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని జగన్ సూచనలు చేశారు.

 Ap Cm Ys Jagan Instructions To Ycp Activists-TeluguStop.com

నిన్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు .మే 13న ఎన్నికల పోలింగ్ జరగబోతుండడంతో అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు చాలా సమయం ఉందని , ఈ సమయాన్ని ఉపయోగించుకుని తమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి,  వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలిసే విధంగా ప్రచార కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politics

అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాలు,  18 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేశామని,  అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం బాగా ఉపయోగపడుతుందని,  ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ఎన్నికల్లో విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని,  175కు 175 స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్( YCP )చేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని జగన్ సూచించారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politics

ఎన్నికల్లో కలిసివచ్చే ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని , ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమన్వయకర్తలు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ,  అభ్యర్థులకు అండగా నిలబడాలని,  త్వరలో చేపట్టబోయే బస్సు యాత్రను విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని , ఎక్కడా టిడిపి, జనసేన ,బిజెపి కూటమి( TDP BJP Janasena ) కి అవకాశం దక్కకుండా అన్ని విషయాల్లోనూ వైసీపీ పై చేయి సాధించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని,  ఎన్నికల్లో గెలవడం వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమని జగన్ దిశనిర్దేశం చేస్తున్నారు.ఎప్పటికప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎత్తుగడలను తిప్పి కొట్టేవిధంగా వ్యూహాలు రచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube