న్యూస్ రౌండప్ టాప్ - 20

1.బండి సంజయ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

జైలులో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైలు మలాకత్ ద్వారా పరామర్శించారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే

సికింద్రాబాదులో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతిర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

3.తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రజల సమస్యలు, సలహాలు , సూచనలు తీసుకునేందుకు గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు చేయించారు.

4.  కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.కరోనా పరిస్థితులపై డి హెచ్, డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.

5.కేసిఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడి విమర్శలు

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వదిలిపెట్టము అంటూ హెచ్చరించారు.

6.కేసిఆర్ పై షర్మిల విమర్శలు

నమ్మి నాన బోస్తే  పుచ్చి బుర్రేలైయినట్టు  ఉంది కేసీఆర్ తీరు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు.

7.విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సురేష్ సమీక్ష

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

8.మౌన దీక్షకు దిగిన పొంగులేటి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మౌన దీక్షకు దిగారు

9.అమరావతి పై చంద్రబాబు కామెంట్స్

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పై తాము 10 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ఇప్పుడు అక్కడ కట్టిన భవనాల నిరుపయోగంగా మారాయి అని చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

10.ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ

ఢిల్లీలో కరోనా, ఒమి క్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

11.ఆర్టీసీ టిక్కెట్లపై జనసేన కామెంట్స్

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు అంశంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.ఏపీలో టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్ కు ఇంకేమీ తెలియదా అంటూ ప్రశ్నించారు.సామాన్యుల కోసం ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించే దమ్ము జగన్ కు ఉందా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

12.ఏపీలో అందుబాటులోకి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్

ఒమి క్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో అందుబాటులోకి వచ్చింది.

13.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

14.ముద్రగడ బహిరంగ లేఖ

కాపులు బిసి ఎస్సీ కులాలను ఉద్దేశించి మాజీమంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు.

15.తిరుమలలో నకిలీ దర్శనం టికెట్లు .నలుగురి అరెస్ట్

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

తిరుమలలో నకిలీ దర్శనం టికెట్లను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

16.నేడు రేపు చంద్రబాబు సమావేశాలు

ఈరోజు రేపు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు.

17.నేడు మణిపూర్ త్రిపురలో ప్రధాని మోదీ పర్యటన 

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

నేడు మణిపూర్ త్రిపురలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

18.ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు విమర్శలు

రాష్ట్రంలో దశ దిశ లేని జగన్ రెడ్డి పాలన సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

19.కార్పొరేషన్ కాబోతున్న అమరావతి

Telugu Ap Telangana, Bjpap, Janasena, Prime Modi, Gold, Top-Latest News - Telugu

ఏపీ రాజధాని అమరావతి త్వరలో కార్పొరేషన్ గా  మారబోతోంది.రాజధానిలోని 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,260

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,260

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube