నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”భగవంత్ కేసరి”.బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టైటిల్ అనౌన్స్ చేయడమే కాకుండా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయడంతో మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.
నందమూరి ఫ్యాన్స్ నుండి ఈ టీజర్ అండ్ టైటిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి షూట్ గురించి అదిరిపోయే అప్డేట్ వినిపిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ షూట్ పై అప్డేట్ తెలుస్తుంది.
ఈ సినిమా షూట్ ప్రజెంట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుందని.అలాగే ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతున్నట్టుగా సమాచారం.దీంతో ఈ సినిమా షూట్ ఇది లాస్ట్ షెడ్యూల్ అని తెలుస్తుంది.
ఒకటి అరా పాటలు బ్యాలెన్స్ ఉన్న జులైలో ముగించేస్తారు అని తెలుస్తుంది.కాగా ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల( Sreeleela ) కనిపిస్తున్న విషయం విదితమే.
ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడు.