ఆండ్రాయిడ్ ఫోన్లలో మాల్వేర్ ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే..!

ఆండ్రాయిడ్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందని ఒక కొత్త నివేదిక వెల్లడించింది.మాల్వేర్ ప్రొటెక్షన్ & ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ ఈఎస్ఈటీ (ESET) ఒక థ్రెట్ రిపోర్ట్‌లో ఆండ్రాయిడ్ థ్రెట్ డిటెక్షన్లు 9.5 శాతం పెరిగాయి.ఈ ఆండ్రాయిడ్/స్పై ఏజెంట్ ట్రోజన్ మాల్వేర్‌ను ఎక్కువగా గుర్తించిన దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఈ రిపోర్ట్ తెలిపింది.

 Android Phones Have More Malware In Our Country, Android Phones, Malware, India,-TeluguStop.com

ఈ ట్రోజన్ ఏజెంట్లు మాల్వేర్ ఫైల్స్‌ లేదా కోడ్ అని రిపోర్ట్ పేర్కొంది.ఇవి గుర్తించని రీతిలో టార్గెట్ డివైజ్‌లోకి ప్రవేశిస్తాయి.మరొక యాప్‌తో కలిసిపోయి మారువేషంలో ఫోన్లలోకి చేరి ఆపై వాటిపై గూఢచర్యం చేస్తాయి.ఇవి రహస్యంగా ఆడియో, వీడియోను రికార్డ్ చేయగలవు.

వాట్సాప్ జీబీ వంటి క్లోన్ యాప్స్‌ మాల్వేర్‌ను కలిగి ఉన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్లలో ప్రధానంగా ఉంటున్నాయి.ఈ యాప్స్‌ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులో లేవు.

వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటే అంతే సంగతులు.ప్లే స్టోర్‌లో కాకుండా బయట ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారి ఫోన్లోకి హానికరమైన కోడ్‌తో సులభంగా రన్ అవుతాయి.

ట్రోజన్ మాల్వేర్ దాడులు వెంటనే గుర్తించడం చాలా కష్టం.

హానికరమైన కోడ్ మీపై గూఢచర్యం చేయవచ్చు, మీ ఫోన్ రోజువారీ పనితీరును గమనించవచ్చు.ఈ దాడులను గుర్తించడం మాత్రమే కాదు, వాటిని వదిలించుకోవడం కూడా కష్టం, హానికరమైన కోడ్‌ను రిమూవ్ చేయడానికి తరచుగా డివైజ్ మొత్తం రీసెట్ చేయడం అవసరం.ఇండియా వారికి ముప్పు అధికంగా ఉంది కాబట్టి యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

లేదంటే మీ పర్సనల్ డేటా హ్యాకర్ల చేతిలో పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube