వైరల్ అవుతున్న యాంకర్ ఉదయభాను పాట.. ఎంత అద్భుతంగా పాడిందో?

ఒకప్పుడు బుల్లితెరపై తన గల గల మాటలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల భామ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Anchor Udayabhanus Song S Going Viral How Amazingly She Sang It, Anchor Udayabha-TeluguStop.com

ఒకప్పుడు ఇండస్ట్రీలో యాంకర్ గా ఓ రేంజ్ లో హడావుడి చేసింది.అప్పట్లో అన్ని షోలల్లో ఉదయభాను( udaya bhanu ) హవానే ఉండేది.

ప్రతి ఒక్కరితో సరదాగా ఉండేది ఉదయభాను.తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.తొలిసారిగా ఎర్రసైన్యం సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఉదయభాను.ఎన్నో రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలలో( reality shows , entertainment shows ) యాంకర్ గా చేసి తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది.పలు సీరియల్ లో కూడా నటించింది.

ఇక ఆమెకు నటిగా కంటే యాంకర్ గా బాగా గుర్తింపు వచ్చింది.ఉదయభాను ఒక యాంకర్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.

Telugu Youtube, Udayabhanu-Movie

అప్పట్లో తన పై చాలా పుకార్లు వచ్చాయి.అయినా కూడా తను వాటిని పట్టించుకోలేదు.వాటిని ఎదుర్కొని మరి తన వృత్తి ఏంటో తానే నిరూపించుకుంది.ఇక పెళ్లి చేసుకుని ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది.ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఫ్యామిలీ బాధ్యతలు చేపట్టింది.ఇక ఈ మధ్యనే ఆమె మరోసారి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.

పైగా సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంది ఉదయభాను.ఎప్పటికప్పుడు తన ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది.

తన పిల్లల వీడియోలు కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇక ఇప్పటివరకు ఈమె ఏ రోజు కూడా గ్లామర్ షో( Glamor show ) చేసినట్లు అనిపించలేదు.

చీర కట్టిన, డ్రెస్ వేసిన చాలా అందంగా, అనుకువుగా కనిపించేది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మోటివేషనల్ మెసేజెస్ కూడా పంచుకుంటూ ఉంటుంది.

Telugu Youtube, Udayabhanu-Movie

ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఇదంతా పక్కన తను ఒక పాట రాయడమే కాకుండా స్వయంగా ఆ పాటను పాడి యూట్యూబ్ లో విడుదల చేసింది.ఇక ఆ పాట వచ్చేసి.దేశం నేపథ్యంలో వచ్చింది.దేశం నీదే తమ్ముడా అనే లైన్ తో స్టార్ట్ చేసిన ఈ పాట చివరి లైన్ వరకు మనసును తాకే విధంగా ఉన్నాయని చెప్పాలి.ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉంది.

ఇక ఈ పాట విన్న వాళ్లంతా పాట రాసినందుకు, స్వయంగా తను పాడినందుకు ఉదయభాను పై ప్రశంసలు కురిపిస్తున్నారు.పాటలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు అని పాట గురించి అద్భుతంగా వివరిస్తున్నారు.

నిజానికి ఉదయభాను పాటను అద్భుతంగా రాయడమే కాకుండా.అద్భుతంగా పాడి ప్రతి ఒక్కరిని ఫిదా చేసిందని చెప్పాలి.

ప్రస్తుతం పాట బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube