తెలుగు ప్రేక్షకులకు స్టార్ యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో చాలా షోలకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ.
అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.బుల్లితెరపై పలు టీవీషోలకు యాంకర్ గా వ్యవహరించిన ఆమె స్టార్ హీరోల సినిమాల్లోనూ సహాయక నటిగా నటించి మెప్పించారు.1994 నుంచి మొదలైన ఆమె సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది.గతంలోలా బుల్లితెరపై ఎక్కువగా కనిపించనప్పటికీ సినిమాల్లో మాత్రం తరచూ కనిపిస్తున్నారు.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనూ కీలక బాధ్యతలు చూసుకుంటున్నారు ఝాన్సీ.
అయితే ఈ విషయాలన్నీ దాదాపు అందరికీ తెలిసినవే.అయితే ఝాన్సీకి 22 ఏళ్ల కూతురు ఉందన్న విషయం చాలామందికి తెలీదు.బయట కూడా ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేదు.
అయితే కొన్ని రోజుల క్రితం తన గారాల పట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు ఝాన్సీ.అప్పుడే తన కూతురు ధన్యను( Dhanya ) అందరికీ పరిచయం చేసింది.
అంతే ఒక్కసారిగా ధన్య ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయాయి.ఝాన్సీ లాగే ధన్య కూడా సినిమాల్లోకి వస్తుందా? రాదా? అని నెటిజన్లు చర్చించుకున్నారు.అయితే ఈ సందేహాలు, అనుమానాల్లోకి తెర దించుతూ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది ధన్య.
ఇందులో భాగంగానే ఇటీవల తన తల్లితో కలిసి ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.ధన్య చూడడానికి ఎంతో క్యూట్ గా, అందంగా ఉంటుంది.ఒక హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆమెలో ఉన్నాయి.
ఇక ధన్య ఇన్ స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే.ఈ క్రమంలోనే తల్లీ కూతుళ్లు కలిసి ఒక టాక్ షోకు వచ్చారు.
ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మెటీరియల్ తప్పకుండా ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.మరి ఈ కామెంట్లపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ం
.