అదేంటి బ్రో.. విజయ్ దేవరకొండ తమ్ముడివి అయ్యి ఉండి లిప్ లాక్ కి అన్ని టేక్సా?

విజయ్ దేవరకొండ( Vijay devarakonda, )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్న వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.

 Anand Deavrakonda In Gam Gam Ganesha Teaser Launch Event, Anand Deavrakonda, B-TeluguStop.com

సినిమా సినిమాకి తన అంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటూ భారీగా అభిమానులను సంపాదించుకుంటూ వచ్చారు విజయ్ దేవరకొండ.ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )తో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.

ఇకపోతే విజయ్ దేవరకొండ మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన ఖుషి సినిమా వరకు విజయ్ చేసిన అన్ని సినిమాలలో లిప్ లాక్ సీన్స్ అన్నది కామన్.

Telugu Arjun Reddy, Gamgam, Lip Lock Scene, Shalini Pandey, Tollywood-Movie

ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో ( Arjun Reddy )విజయ్ రొమాన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే.ఇక అన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.విజయ్ తమ్ముడిగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే బేబీ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండపై అభిమానులు మంచి అంచనాలనే పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గం గం గణేశా.( Gam gam ganesha ) ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది.

Telugu Arjun Reddy, Gamgam, Lip Lock Scene, Shalini Pandey, Tollywood-Movie

హై లైఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈ టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఆనంద్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ఈ సందర్భంగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.

ఆనంద్ దేవరకొండ( Anand deavrakonda ) అన్నతో చేయడం చాలా ఆనందంగా ఉంది.నాకు మొదట ఆనంద్ అన్న ఉన్న ప్రతి సీన్ లో నేను కూడా ఉంటాను అని చెప్పారు.

అయితే ఒకరోజు నాకు సీన్ లేదు అన్నారు.నాకు లేదు అంటే ఆనంద్ అన్నకు కూడా ఉండదు అనుకున్నాను.

అయితే అక్కడకు వెళ్లి చూస్తే ఆనంద్ అన్న లిప్ లాక్ సీన్ చేస్తున్నాడు.ఒకటి కాదు రెండు కాదు 20 టేకులు తీసుకున్నాడు.

టీజర్ లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది.టేక్స్ తీసుకున్న ప్రతిసారి ఏ ఇదంతా నా వల్ల కావడం లేదు.

అని ఆనంద్ అన్న చెప్పేవాడు.ఎలాగోలా 20 టేకుల తరువాత ఆ లిప్ లాక్ సీన్ ఓకే అయ్యింది అని ఇమాన్యుల్ నవ్వుతూ చెప్పడంతో ఆనంద్ దేవరకొండ ఏం మాట్లాడాలో తెలియక నవ్వుతూ సిగ్గుతో తలదించుకున్నాడు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆ వీడియో పై ఫన్నీగా స్పందిస్తున్నారు.విజయ్ దేవరకొండ తమ్ముడివి అయ్యి ఉండి ఒక్క లిప్ లాక్ సీన్ కోసం అన్ని టేకులు తీసుకోవడం ఏంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube