సాధారణంగా రోడ్ సైడ్ రోమియోలు బైక్స్‌పై మహిళల వెంట పడుతుంటారు.లేదంటే సైకిల్, బస్సు వంటి వాహనాలలో అమ్మాయిలను ఫాలో అవుతుంటారు.
అయితే తాజాగా ఒక వృద్ధుడు మాత్రం ఒక మహిళను ఫాలో అయ్యేందుకు ఏకంగా ప్రైవేటు విమానాన్నే వాడాడు.ఈ సంగతి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే, 65 ఏళ్ల మైఖేల్ ఆర్నాల్డ్( Michael Arnold ) అనే పైలట్ తన ప్రైవేట్ విమానాన్ని ఉపయోగించి న్యూయార్క్‌లోని అప్‌స్టేట్‌లో ఒక మహిళకు సైట్ కొడుతున్నాడు.ఈ ఆరోపణలతో మహిళ కేసు నమోదు చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు అక్టోబరు 5వ తేదీ గురువారం నాడు కోర్టులో హాజరపరచగా తాను నిర్దోషి అని వాదించాడు.
మైఖేల్ ఆర్నాల్డ్ 65 ఏళ్ల వ్యక్తి తన ప్రైవేట్ విమానాన్ని ఉపయోగించి న్యూయార్క్‌లోని అప్‌స్టేట్‌లో( upstate New York ) ఒక మహిళను వెంబడించినట్లు అభియోగాలు మోపామని పోలీసులు తెలిపారు.పోలీసులను అడ్డుకోవడం, పోలీసు అధికారికి తప్పుడు సమాచారం ఇవ్వడం, అరెస్టును అడ్డుకోవడం వంటి అభియోగాలు కూడా అతనిపై ఉన్నాయి.మైఖేల్ ఆర్నాల్డ్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా న్యూయార్క్ అనుసరిస్తూ వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.అతను తన విమానం నుంచి టమోటాలు విసిరి, షుయ్లర్‌విల్లే గ్రామం మీదుగా ఎగురుతూ కనిపించాడని ఆరోపించింది.
అతని వల్ల ఏదైనా హాని కలుగుతుందేమోనని భయపడుతున్నానని, ఆర్నాల్డ్ తన విమానాన్ని తన ఇంటి మీద ఎగురవేస్తాడేమోనని ఆందోళన చెందుతున్నానని బాధితురాలు తెలిపింది.తనకున్న కేఫ్‌లో ఆర్నాల్డ్ ఒక కస్టమర్ అని ఆమె చెప్పింది.
ఆర్నాల్డ్ మహిళా ఆరోపణలను కొట్టిపారేశాడు, తాను ఎవరినీ వేధించలేదని చెప్పాడు.ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అతడు చెప్పాడు.అయితే ఆమె ఇంటికి, వ్యాపారానికి దూరంగా ఉండాలని, అన్ని విమానాలకు దూరంగా ఉండాలని షరతులను కోర్టు విధించింది.అనంతరం బెయిల్‌పై విడుదల చేసింది.అలాగే ఎలాంటి విమానాలను నడపకుండా నిషేధించింది.