ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాల మద్య ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM jagan )హటాత్తుగా డిల్లీ వెళ్లారు.రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) అయిన తరువాత వెంటవెంటనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా జరిగిందనే వాదనలు రావడం, జనసేన టీడీపీతో పొత్తు ప్రకటించడం, బాబు అరెస్ట్ లో కేంద్ర పెద్దల పాత్ర కూడా ఉందనే గుసగుసలు తెరపైకి రావడం.ఇలా రకరకాల ఆసక్తికర అంశాలు చాలానే చోటు చేసుకున్నాయి.
ఇలా రసవత్తరంగా జరుతున్న పరిణామాల మద్య వైఎస్ జగన్ ఉన్నపళంగా డిల్లీ వెళ్లారు.

ఇంతకీ ఆయన ఇంత హటాత్తుగా డిల్లీ వెళ్లాల్సిన అవసరం ఎమొచ్చింది ? అనే దానిపై డిబేట్లు గట్టిగానే జరిగాయి.డిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah )తో గంటల తరబడి సమావేశం అయ్యారు.ఇంతకీ ఆ సమావేశం లో ఏం చర్చించారు అనేది కూడా రహస్యంగానే ఉంది.
కానీ అధికార నేతలు చెబుతున్నా దాని ప్రకారం రాష్ట్రనికి రావలసిన నిధుల విషయంలో కేంద్ర పెర్ద్దలతో చర్చించేందుకు జగన్ డిల్లీ వెళ్ళినట్లు చెబుతున్నారు.కానీ జగన్ డిల్లీ టూర్ వెనుక చాలా కథే ఉందనేది కొందరు చెబుతున్నా మాట.కేంద్ర పెద్దలకు జగన్ కు( CM jagan ) సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.

వైసీపీ బీజేపీ( YCP BJP ) మద్య అంతర్గత పొత్తు కొనసాగుతోందనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.ఈ నేపథ్యంలో కేంద్ర సహకారంతోనే బాబు అరెస్ట్ కు జగన్ పూనుకున్నారనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.ఇదే టైమ్ లో టీడీపీతో పొత్తును బీజేపీ ఎప్పటి నుంచో విభేదిస్తున్నారు కాషాయ పార్టీ పెద్దలు.కానీ బీజేపీతో దోస్తీలో ఉన్న జనసేన టీడీపీతో కూడా పొత్తు ప్రకటించింది.ఈ రాజకీయ పరిణామాల మద్య జగన్ డిల్లీ టూర్ లో బీజేపీ వైసీపీ కలయిక పై చర్చ జరుగుండే అవకాశం ఉందనేది కొందరు చెబుతున్నా మాట.ఇక జగన్ డిల్లీ పర్యటన ముగించుకొని నేడు మళ్ళీ విజయవాడ చేరుకున్నారు.అయితే డిల్లీ టూర్ లో ఏం జరిగిందనేది మున్ముందు బహిర్గతం అవుతాయనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.







