కిమ్‌కి చెక్ పెట్టేందుకు అమెరికా ప్లాన్... ఏకంగా అణు జలాంతర్గామిని దించిందిగా?

అమెరికాకు( america ) చెందిన రెండవ అతిపెద్ద అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియాలో లంగరేయడంతో అంతర్జాతీయంగా ఇపుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయింది.లాస్‌ ఏంజెల్స్‌ శ్రేణికి చెందిన యూఎస్‌ఎస్‌ అన్నాపోలిస్‌ జలాంతర్గామి జిజు ద్వీపంలో ఆగివుండడం గమనించిన కొందరు ఈ విషయాన్ని కిమ్ కి చేరవేసినట్టు సమాచారం.

 America's Plan To Check Kim While Simultaneously Bringing Down A Nuclear Submari-TeluguStop.com

ఉత్తరకొరియా క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన కొన్ని గంటల్లోనే అమెరికా అణు జలాంతర్గామి ప్రత్యక్షం కావడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.శ్రతువుల నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి అమెరికా ఈ సబ్‌మెరైన్‌ను వాడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telugu America, International, Kim Jong, Latest, Korea, Submarine, Supreme-Telug

యూఎస్‌ఎస్‌ అన్నా పోలీస్‌లో ఒక న్యూక్లియర్‌ రియాక్టర్‌ ( Nuclear reactor )కూడా ఉన్నట్టు భోగట్టా.ఇక తాజాగా జిజు ద్వీపం నుంచి ఈ సబ్‌మెరైన్‌ కు అవసరమైన నిత్యావసరాలను సేకరిస్తోంది.కానీ, ఉత్తరకొరియా మాత్రం అమెరికా నౌకాదళం దక్షిణ కొరియాకు శిక్షణ ఇస్తోందని అందుకే ఈ జలాంతర్గామి వచ్చిందని అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.వారం క్రితం అమెరికా అణు క్షిపణులను ప్రయోగించే సామర్థం ఉన్న జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కెంటకీ బుసాన్‌( USS Kentucky Busan ) రేవుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ అంశమే తాము దక్షిణ కొరియాపై అణుదాడి చేయడానికి కారణం కావచ్చని ఉత్తరకొరియా రక్షణ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.కాగా 1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Telugu America, International, Kim Jong, Latest, Korea, Submarine, Supreme-Telug

ఇకపోతే ఒక అమెరికా సబ్‌ మెరైన్‌ దక్షిణ కొరియా జాలాల్లోకి గత వారం వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.ఇది జరిగిన వారంలోపే మరో అణుశక్తి జలాంతర్గామి రావడం కొసమెరుపు.ఉత్తర కొరియాలోకి చొరబడి అక్కడి దళాలకు దొరికిపోయిన అమెరికా సైనికుడు ట్రావిస్‌ కింగ్‌ ( Travis King )అప్పగింతపై చర్చలు మొదలయ్యాయి.యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌, ఉత్తరకొరియా ఈ చర్చలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని అమెరికా నేతృత్వంలోని మల్టీనేషనల్‌ కమాండ్‌ వెల్లడించింది.కొరియా యుద్ధం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ఈ చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొస్తోంది.

అయితే తాజాగా అమెరికా చర్యపై కిమ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోని సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube