అమెరికన్ సింగర్ నోట ‘ ఓం జై జగదీశ్‌ హరే ’ పాట

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్‌ తన మ్యూజికల్ అభిమానులకు, ముఖ్యంగా భారతీయ హిందువులకు చిన్న కానుకను ఇచ్చారు.భారతీయులు భక్తిశ్రద్ధలతో ఆలపించే ఓం జై జగదీశ్‌ హరే పాటను ఆమె పాడి వీడియో రిలీజ్ చేశారు.

 American Singer Releases Virtual Performance Of ‘om Jai Jagdish Hare’ For Di-TeluguStop.com

అమెరికన్ పాప్ సింగర్ అంటే మోడ్రన్‌గా కనిపిస్తారన్న నానుడి వుంది.అయితే మిల్‌బెన్ ఈ పాటను ఆలపించేటప్పుడు భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా కట్టు, బొట్టు ధరించడం విశేషం.

మరోవైపు ఈ పాటలోని కఠినమైన పదాలు సవ్యంగా పలికేందుకు గాను కొన్ని నెలల పాటు సాధన చేసినట్లు మేరీ చెప్పారు.కాగా ఈ పాటను సెడెనాలోని ద చాపెల్‌ ఆఫ్‌ హోలీ క్రాస్ వద్ద ఆలపించడం గమనార్హం.

ఇందుకు సంబంధించి ట్వీట్ చేసిన ఆమె.దీపావళి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ హిందువులు ఓం జై జగదీశ్‌ పాటను ఆలపిస్తూ ఉంటారు.ఈ పాట తనను, తన ఆత్మను ఎంతగానో కదిలించిందన్నారు.భారతీయ సంప్రదాయం పట్ల తనకు మరింత మక్కువను కలిగించిందని మేరి కామెంట్ పెట్టారు.మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.సూపర్‌ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుండగా.

ఈ పాట పాడేందుకు హోలీ క్రాస్ సరైన ప్రదేశం కాదేమో అని మరికొందరు అంటున్నారు.కాగా ఈ ఏడాది ఆగష్టు 15న మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలపించి, ఇక్కడి వారి మనన్నలు పొందిన విషయం తెలిసిందే.

Telugu Corona, Diwali Festival, Nationalgreen-Telugu NRI

కాగా ఈసారి భారత్‌లో దీపావళికి బాణాసంచా వెలుగులు, మోతలు కనిపించవు.వినిపించవు.బాణాసంచా కాల్చడం వల్ల వాయుకాలుష్యం ఎక్కువవుతుందని, ఇది ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది.కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఇలాంటి సమయంలో బాణాసంచా కాల్చడం సరికాదన్న అభిప్రాయాన్ని ఎన్జీటీ వ్యక్తం చేసింది.

గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలతో పాటు నిపుణుల సూచనల మేరకు దేశంలోని చాలా రాష్ట్రాలు బాణా సంచాను నిషేధించాయి.ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం పర్యావరణానికి హానీ కలిగించని టపాసులు పేల్చుకోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది.

అటు తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టపాసులు ఖచ్చితంగా నిషేధించి తీరాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube