అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూని( Taranjit Singh Sandhu ) ఖలిస్తాన్ మద్ధతుదారులు అడ్డుకోవడంపై అమెరికన్ సిక్కు సంఘం తీవ్రంగా ఖండించింది.ఈ ఘటనలో ప్రమేయమున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యూయార్క్ గురుద్వారా( New York Gurdwara ) నిర్వాహకులను కోరుతూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికాలోని సిక్కులు గురుద్వారాలను వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు దూరంగా వుంచాలని సంఘం హితవు పలికింది.సంధూను అడ్డుకున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఖ్స్ ఆఫ్ అమెరికా వ్యవస్ధాపకుడు , ఛైర్మన్ జస్దీప్ సింగ్ జెస్సీ.
( Jasdip Singh Jassee ) ఈ సంస్థ అధ్యక్షుడు కన్వల్ జిత్ సింగ్ సోనీలు( Kanwaljit Singh Soni ) ఓ సంయుక్త ప్రకటనలో కోరారు.భారత రాయబారిని అగౌరవపరచడమే కాకుండా గురుద్వారాల పవిత్రతను ఉల్లంఘించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలతో కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న ఖలిస్తాన్ మద్ధతుదారులు, సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు చోట్ల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.
తాజాగా కెనడా గొడవ అమెరికాకు పాకింది.ఏకంగా భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూని ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.సిక్కు మత వ్యవస్ధాపకుడు గురునానక్ జయంతి( Gurunanak Jayanthi ) సందర్భంగా న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో వున్న హిక్స్‌విల్లే గురుద్వారాలో( Hicksville Gurdwara ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ పాల్గొని ప్రసంగించారు.అనంతరం తిరిగి వెళ్తుండగా ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆయనను ఒక్కసారిగా చుట్టుముట్టారు.ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ పాత్ర వుందని ఆరోపించారు.
అలాగే సిక్కు వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సైతం కుట్ర పన్నారని పేర్కొన్నారు.అయితే గురుద్వారా నిర్వాహకులు, భద్రతా సిబ్బంది సాయంతో సంధూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.