ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవ పై అమెరికా అధ్యక్షుడు వైరల్ కామెంట్స్..!!

ప్రపంచ పెద్దన్న అమెరికా సపోర్ట్ చాలా వరకు ఇజ్రాయెల్ కి ఉంటుందన్న సంగతి తెలిసిందే.అందువల్లే ఇజ్రాయేల్ చుట్టుపక్కల అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ టచ్ చేయటానికి భయపడతాయి అని అంటుంటారు.

 American President Viral Comments On Israel-palastina Conflict America, Israel,-TeluguStop.com

ఇదిలా ఉంటే నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ వైఖరి మాత్రం ప్రస్తుతం ఇజ్రాయెల్ కి వ్యతిరేకం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో మొదటి నుండి టాక్ వుంది.పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయిల్ -పాలస్తీనాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

గాజా ప్రాంతం నుండి ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ తీవ్రవాదులు రాకెట్లు ప్రయోగించటం మరోపక్క ఇజ్రాయెల్ వైమానిక దళంతీవ్రవాదుల స్థావరాల పై భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపించడంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివాదంపై అనేక దేశాలు స్పందించాయి.సామరస్య వాతావరణంలో ఇరుపక్షాల వ్యవహరించాలని కోరారు.

ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజా వివాదం పై వైరల్ కామెంట్ చేశారు.ప్రస్తుతం నెలకొన్న వివాదాన్ని ఇజ్రాయెల్, పాలస్తీనాలే పరిష్కరించుకోవాలని అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.

మరోపక్క ఇజ్రాయేల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆ విషయంలో అమెరికా కట్టుబడి ఉందని జో బైడెన్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube