అఫీషియల్: జైలర్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న ప్రముఖ సంస్థ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Deelipkumar)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన తాజా చిత్రం జైలర్( Jailer ) .ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, శివ రాజ్ కుమార్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.

 Amazon Prime Announced Jailer Ott Release Date, Jailer, Ott Release Date, Tollyw-TeluguStop.com

ఇక ఆగస్టు 10వ తేదీ ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఆగస్టు 10వ తేదీ విడుదల అయ్యి ఇప్పటివరకు 600 కోట్లకు పైగా కలెక్షన్లు( Jailer Movie Collections ) రాబట్టడంతో దర్శక నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూశారు.అయితే మొదట్లో ఈ సినిమా సన్ నెక్స్ట్ లో రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.అలాగే హిందీ వర్షన్ మాత్రమే అమెజాన్ లో వస్తుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు అన్నింటిని కొట్టి పారేస్తూ ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా అన్ని విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా అన్ని భాషలలో డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలుగు తమిళ హిందీ మలయాళ అన్ని భాషలలోనూ ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.ఇక ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయడమే కాకుండా ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండబోతుందని తెలియజేశారు.ఇలా ఆగస్టు 10వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతుండడంతో ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిన వారందరూ కూడా అమెజాన్లో చూడటం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube