అమెజాన్ నుంచి అత్యంత చవకైన సర్వీస్.. ఎన్ని బెనిఫిట్స్ తెలిస్తే..

సినిమాలు, వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ సినిమాలకు కొదవ లేదనుకుంటే అమెజాన్ లో రీజనల్ సినిమాకు కొదవుండదు.

 Amazon Introducing Prime Lite With Cheaper Plans Details, Amazon Prime, Amazon P-TeluguStop.com

అందుకే భారతదేశంలో ఇది బాగా హిట్ అయింది.అయితే ఈ మధ్య అమెజాన్ తన ఇయర్లీ ప్లాన్ $18 అంటే రూ.1499కి పెంచేసింది.అంటే నెలకు 175 రూపాయలు ధర పడుతుంది.

చాలామంది ఇంత ధర పెట్టి ఒకేసారి అమెజాన్ ప్రైమ్ తీసుకోలేకపోతున్నారు.దీనివల్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లైట్ అనే ఒక చవకైన ప్రైమ్ సర్వీసును తీసుకురావడం మొదలుపెట్టింది.ఈ ప్రైమ్ లైట్ ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్లకు కస్టమర్లకు $12 అంటే 999 రూపాయలకు ఇయర్లీ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

అమెజాన్ తన భారతీయ వెబ్‌సైట్‌లో దాని ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ లిస్ట్‌ చేసింది.దాని ప్రకారం ప్రైమ్ లైట్ అన్‌లిమిటెడ్ ఫ్రీ 2-డే, స్టాండర్డ్ డెలివరీని అందిస్తుంది.

Telugu Amazon Cheap, Amazon Prime, Plann, Prime Lite, Primelite-Latest News - Te

కానీ ఇది సేమ్ డే లేదా వన్ డే డెలివరీని అందించదు.అదనంగా అమెజాన్ పేతో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు 5% క్యాష్‌బ్యాక్‌ని ఆఫర్ చేస్తుంది.ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ కూడా వీక్షించవచ్చు.కాకపోతే వీడియో మధ్యలో ప్రకటనలు చూడాల్సి వస్తుంది.ఈ ప్రైమ్ వీడియో స్టాండర్డ్ డెఫినిషన్ (SD) కంటెంట్‌ను మాత్రమే అందిస్తుంది.కంటెంట్‌ను ఏకకాలంలో రెండు డివైజ్‌ల్లో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది.

Telugu Amazon Cheap, Amazon Prime, Plann, Prime Lite, Primelite-Latest News - Te

కొత్త ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌లో అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌కు యాక్సెస్ ఉండదు.ఇంకా, ప్రైమ్ లైట్ యూజర్లకు నో-కాస్ట్ EMI, ఫ్రీ ఈబుక్‌లు లేదా ప్రైమ్ గేమింగ్‌కు యాక్సెస్ లభించదు.ఇలా చూసుకుంటే కొన్ని బెనిఫిట్స్ తీసేసిన తర్వాత ప్రైమ్‌కి ప్రైమ్ లైట్ ఉత్తమమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube