ఆమని.అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న అందాల తార.ఈమెను చూడగానే మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభసంకల్పం, మావిచిగురు లాంటి ఎన్నో అద్భుత సినిమాలు గుర్తొస్తాయి.ఇలాంటి సినిమాలు ఒక్క ఆమని మాత్రమే చేగలదని చెప్తారు సినీ జనాలు.
బాపు, విశ్వనాథ్ లాంటి దిగ్గజ దర్శకులతో ఆమె నటించారు.కె రాఘవేంద్ర రావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ క్రిష్ణారెడ్డి లాంటి దర్శకులతో ఎన్నో చక్కటి సినిమాలు చేసింది.
19873 నవంబర్ 16న బెంగళూరులో జన్మించింది ఆమని. ఆమని అసలు పేరు మంజుల.
వీరి పూర్వికులు తెలుగువారు.అనంతపురానికి చెందిన వీరి కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లిపోయారు.
వీరిది ఓ మధ్యతరగతి కుటుంబం.ఈమె తండ్రి ఓ చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్.
జంబలకిడిపంబ సినిమాతో ఆమని తెలుగు తెరకు పరిచయం అయ్యింది.కామెడీ సినిమాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చేసిన ఈ సినిమా బంఫర్ హిట్ కొట్టింది.
దీంతో ఆమె వెనుతిరిగి చూసుకోలేదు.కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.
ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేది.తన తండ్రికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్ చెన్నైలో ఉండటంతో అక్కడికి వెళ్లారు.సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు.చాలా చోట్ల ఆమెకు రిజెక్ట్ అనే మాటే వినిపించింది.ఆ సమయంలో ఓ తమిళ సినిమా చేసినా పెద్దగా పేరు రాలేదు.జంబలకిడిపంబ సినిమాతో ఓ రేంజిలో పేరొచ్చింది.
ఆ తర్వాత తను టాలీవుడ్ లో దూసుకుపోయింది.టాప్ హీరోయిన్ గా మారి.
టాప్ హీరోలందరి సరసన నటించింది.చిరంజీవితో మాత్రమే తను సినిమా చేయలేదు.
దానికి కారణం ఉన్నట్ల ఆమె వెల్లడించింది.సినిమా రంగంలో మంచి బిజీగా ఉన్న సమయంలోనే తను ప్రేమ వివాహం చేసుకుంది.
దీంతో తను చిరంజీవితో ఆడిపాడలేకపోయింది.ఆ తర్వాత కొంత కాలానికి తను సినిమాల నుంచి దూరం జరిగి.
కుటుంబంతో ఆనందంగా గడుపుతుంది.ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు.
ప్రస్తుతం తను ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.