'పవన్ వెంట నేను ఉన్నాను'.. బన్నీ బలమైన సంకేతం పంపించాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమ్లా నాయక్’ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో పవన్ ను మాస్ అవతార్ లో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఊగి పోతున్నారు.

 Allu Arjun Watched Bheemla Nayak At Amb Details, Allu Arjun, Bheemla Nayak, Amb-TeluguStop.com

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ రేంజ్ కు తగిన సినిమా పడడంతో ఆ రేంజ్ లో హిట్ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.  ముఖ్యంగా పవన్ కు చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద హిట్ దక్కడంతో ఆయన మరింత ఆనందంగా ఉన్నాడు.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమా ఆద్యంతం అలరిస్తుంది.

ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ టచ్ చేసి పవన్ వెంట మేమున్నాం అంటూ రుజువు చేసారు ఆయన ఫ్యాన్స్.

అయితే ఈ సినిమా ఇంత ఘానా విజయం సాధించిన ఎవ్వరు స్పందించలేదు.మరి మెగా ఫ్యామిలీ వారు ఈ సినిమాను చూసారో లేదో తెలియదు కానీ అల్లు అర్జున్ మాత్రం కుటుంబ సమేతంగా చేసాడు.

దీంతో బన్నీ ఈ సినిమా చేసిన తర్వాత ఏదొక రివ్యూ ఇస్తాడు అని ఎదురు చూసినప్పటికీ అలా ఏం జరగలేదు.

Telugu Allu Arjun, Amb Mall, Bheemla Nayak, Bunny, Chiranjeevi, Nithya Menon, Ra

దీంతో మెగా, అల్లు కుటుంబాలకు మధ్య ఏదో వైరం ఉందనే ప్రచారం మళ్ళీ జరుగుతుంది.పవన్ అభిమానులకు, బన్నీ అభిమానులకు ముందు నుండి వైరం ఉన్న విషయం తెలిసిందే.మెగా హీరోలు ఎంత చెప్పిన వీరు అప్పటికి శాంతిస్తారు కానీ పూర్తిగా మాత్రం కాదు.

మరి ఇలాంటి రూమర్స్ కు చెక్ పెట్టడానికే బన్నీ ఇలా భీమ్లా సినిమాను కుటుంబ సమేతంగా వీక్షించినట్టు తెలుస్తుంది.

Telugu Allu Arjun, Amb Mall, Bheemla Nayak, Bunny, Chiranjeevi, Nithya Menon, Ra

అయితే రివ్యూ ఇవ్వక పోయినంత మాత్రానా వీరి కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నట్టు కాదు.రివ్యూ ఇవ్వడం, ఇవ్వక పోవడం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం.దీనినే ఇలా భూతద్దం లో పెట్టి మరి చూసి వివాదాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు.

పవన్ ని అభిమానించకుంటే బన్నీ సినిమాకు ఫ్యామిలీతో కలిసి ఎందుకు వెళ్తాడు.అలా వెళ్లి పవన్ వెంట నేను ఉన్నాను అని బన్నీ సంకేతం ఇచ్చినట్టు అనిపిస్తుంది.

ఏది ఏమైతేనేం భీమ్లా సినిమాను బన్నీ కుటుంబ సమేతంగా చూడడం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube