టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కు నేషనల్ అవార్డ్ రావడంతో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.తనను ట్యాగ్ చేస్తూ ఎవరైనా అభినందనలు తెలిపితే బన్నీ కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
అయితే ఎన్టీఆర్, సాయితేజ్( NTR, Saitej ) చేసిన ట్వీట్లకు బన్నీ జెన్యూన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ స్పందించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోందనే చెప్పాలి.
జెన్యూన్ అంటూ బన్నీ సమాధానం ఇస్తుండటం మిగతా వాళ్లు ఫేక్ అని బన్నీ భావిస్తున్నారా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపి తన సక్సెస్ ను కోరుకునే వాళ్ల విషయంలో బన్నీ ఈ విధంగా స్పందిస్తున్నారని కొంతమంది చెబుతున్నారు.భవిష్యత్తులో ఇంటర్వ్యూలలో బన్నీ జెన్యూన్ అని ప్రస్తావించడం వెనుక అసలు కారణాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది.
అల్లు అర్హ( Allu Arha ) పుట్టిన తర్వాతే బన్నీకి కెరీర్ పరంగా అనుకున్న స్థాయిలో కలిసొస్తుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా బన్నీ ఫాలోవర్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బన్నీకి అవార్డ్ రావడంతో బన్నీ ఫ్యామిలీలో సంబరాలు అంబారన్నంటాయి.అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా సరైన అడుగులు వేసి మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.రాజమౌళి సపోర్ట్ లేకుండానే బన్నీ ఈ స్థాయిలో సక్సెస్ సాధించగా జక్కన్న సపోర్ట్ ఉంటే మాత్రం అల్లు అర్జున్ కు తిరుగుండదు.బన్నీ పుష్ప2 సినిమాకు క్రేజ్ పెరుగుతుండగా ఈ సినిమా కూడా బన్నీకి మరిన్ని అవార్డులను తెచ్చిపెట్టాలని బన్నీ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.