ఆ ఒక్క సీన్ కోసం 51 టేకులు తీసుకున్న అల్లు అర్జున్.. ఏదో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సీక్వెల్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులకు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

 Allu Arjun Takes 51 Takes For Key Scene For Pushpa 2 ,allu Arjun,pushpa 2, Sukum-TeluguStop.com

పుష్ప సినిమా భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా సీక్వెల్ సినిమా ఎప్పుడు రాబోతుందా అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరికేక్కినటువంటి ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక పుష్ప2 ( Pushpa 2 )సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఇక ఈ సీక్వెల్ సినిమాలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో వచ్చే సన్నివేశాలు చాలా హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ వీడియోలో ఈయన అమ్మవారి గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇలా ఈ టీజర్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో బన్నీ అమ్మ వారి గెటప్ లో కనిపించే సమయంలో హావభావాలు చాలా స్పష్టంగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.అచ్చం అమ్మవారి నడిచి వస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే పర్ఫెక్ట్ గా ఉండడం కోసమే ప్రయత్నం చేశారట.

ఇలా అమ్మవారి గెటప్లో నడిచి వచ్చే సన్నివేశాన్ని తీయడం కోసం ఏకంగా 51 టేకులు తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube