అల్లు అర్జున్( Allu Arjun ) సౌత్ లోనే కాకుండా నార్త్ లో భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఇప్పటి వరకు మరే సౌత్ హీరో లకు కూడా సాధ్యం కానీ బుల్లి తెర రేటింగ్ రికార్డు లను కూడా అల్లు అర్జున్ దక్కించుకోవడం విశేషం.
అల్లు అర్జున్ గతం లో డీజే సినిమా మొదలుకుని చాలా సినిమా లు హిందీ లో డబ్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.బుల్లి తెరపై మరియు యూట్యూబ్ ద్వారా అల్లు అర్జున్ పాత డబ్బింగ్ సినిమా లను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేయడం చూశాం.
అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా తో అంతకు మించి అన్నట్లుగా అభిమానులను అలరించాడు.
అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa Movie ) తాజాగా బుల్లి తెరపై మరోసారి సెన్షేషన్ క్రియేట్ చేయడం జరిగింది.పుష్ప సినిమా హిందీ బుల్లి తెరపై ఎప్పుడు టెలికాస్ట్ అవుతున్నా కూడా ప్రేక్షకులు లక్షల్లో చూడటం ఛానల్ నిర్వాహకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సినిమా హిందీ లో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సమంత ఐటం సాంగ్( Samantha Special Song ) చేసింది.హిందీ ప్రేక్షకులకు ప్రతి ఒక్క ఎలిమెంట్ తెగ నచ్చింది.
అందుకే ఏకంగా జాతీయ అవార్డులు కూడా పుష్ప సినిమా కొల్లగొట్టింది.అలాంటి పుష్ప సినిమా బుల్లి తెరపై ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా( Pushpa 2 ) విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ ఆ సినిమా ను ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఆగస్టు లో విడుదల అవ్వబోతున్న పుష్ప 2 లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.