కేంద్ర బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో( Parliament Budget Sessions ) భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్( Interim Budget ) ను ప్రవేశపెట్టారు.ఈ క్రమంలోనే వివిధ శాఖలకు బడ్జెట్ లో కీలక కేటాయింపులు చేశారు.రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లను బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి.రైల్వేశాఖకు రూ.2.55 లక్షల కోట్లు, హోంశాఖకు రూ.2.03 లక్షల కోట్లతో పాటు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి.

 Allocations To Various Departments In The Central Budget,central Budget,parliame-TeluguStop.com

అలాగే గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77 లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖకు రూ.2.78 లక్షల కోట్లు, ఆహారం, ప్రజా పంపిణీకి రూ.2.13 లక్షల కోట్లు కేటాయించారు.రసాయనాలు, ఎరువులకు రూ.1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్ రంగానికి రూ.1.37 లక్షల కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేల కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6200 కోట్లు, సెమీ కండక్టర్లు,డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6903 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్ కు రూ.8500 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు రూ.600 కోట్లు కేటాయింపులు జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube