దేశవ్యాప్తంగా జరగబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికలలో. ఎక్కువ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.
ప్రస్తుతం ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు ఇతర పార్టీలోకి జంప్ అయిపోతున్నారు.మరోపక్క ఎస్పీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా అఖిలేష్ యాదవ్ తన పోటీ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో పోటీ చేయను అని ప్రకటన చేసిన అఖిలేష్ తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు పోటీకి సిద్ధమయ్యారు.
ఈనేపథ్యంలో ఆజంగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అని.అది కూడా అక్కడి ప్రజలు అనుమతిస్తేనే.పర్మిషన్ ఇస్తేనే పోటీకి నిలబడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలలో పోటీ చేయనని ఇంతకుముందు అఖిలేష్ ప్రకటించడం జరిగింది.ఇదే తరుణంలో బీజేపీ నుంచి మాకు సర్టిఫికెట్ అవసరం లేదు.అంటూ తనదైన శైలిలో కొన్ని విషయాలపై సెటైర్లు వేశారు.
మరోపక్క బీజేపీ పార్టీ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ మళ్లీ అధికారంలోకి రావాలని.ఇతర పార్టీలకు చెందిన వారిని తమ పార్టీలోకి జాయిన్ చేసుకుంటూ ఉంది.
అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని.బీజేపీ తమ పార్టీలో జాయిన్ చేసుకోవటానికి మంతనాలు జరుపుతోంది.దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ వర్సెస్ బీజేపీ అన్న తరహాలో సీన్ క్రియేట్ అయింది.ఎవరు అధికారంలోకి వస్తారు అనేది సస్పెన్స్ గా ఉంది.