ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా రంగాల్లో నాయకులు, హీరోలతో పోల్చితే కార్యకర్తలు, అభిమానులు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.తమ అభిమాన నాయకులపై లేదంటే హీరోలపై ఏ వ్యతిరేక వార్త వచ్చినా.
తట్టుకోలేకపోతున్నారు.సోషల్ మీడియాకు ఎక్కి నానా రభస చేస్తున్నారు.
కొందరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పక్కవారితో గొడవలకు దిగుతున్నారు.అంతేకాదు.
ఇతర హీరోలపై ట్రోల్స్ చేస్తుంటారు.మన దగ్గర టాప్ హీరోలు చాలా ఎక్కువ.
కోలీవుడ్ లో కేవలం ఇద్దరే టాప్ స్టార్స్ ఉన్నారు.వారిలో ఒకరు విజయ్ కాగా.
మరొకరు అజిత్.
విజయ్ కోలీవుడ్ లో దుమ్మురేపుతున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ముందుకు సాగుతున్నాడు.అటు అజిత్ విశ్వాసం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.
కానీ రెండేళ్లుగా ఏ సినిమా విడుదల చేయలేదు.తాజాగా ఆయన నటిస్తున్న వలిమై సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
అటు ఈ ఏడాదిలో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్న సినిమాల లిస్టును బుక్ మై షో సంస్థ రిలీజ్ చేసింది.
ఇందులో KGF చాప్టర-2 కోసం 3 లక్షల మంది ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది.మలయాళ మూవీ మరక్కర్ 1 లక్షా 9 వేల మంది ఆసక్తిగా ఉన్నారని చెప్పింది.మూడో ఫ్లేస్ లో వలిమై లక్ష మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
కనీసం ఈ రికార్డ్ అయినా బ్రేక్ చేయలేకపోయారని విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.దీంతో ఒక్కరోజులోనే అజిత్ ఫ్యాన్స్ 6 లక్షల మార్క్ ని దాటించేశారు.
ఇండియా లో ఈ రేంజ్ లో ఏ సినిమా కి దక్కని ఆదరణ ఈ సినిమాకు దక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమాకు సంబంధించిన ఏ పోస్టర్ కూడా రిలీజ్ కాక ముందే అజిత్ మూవీ ఈ రికార్డు కొట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ విషయంలోనే ఇలా ఉంటే మూవీ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.