మెగా హీరోలకు అజిత్ సినిమాలు అచ్చిరాలేదా.. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో?

ఒక భాషలో ఒక హీరో నటించిన సినిమాని మరో భాషలో మరొక హీరో రీమేక్ చేయడం అన్నది కామన్.అలా రీమేక్ చేసిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ లు కాగా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా కూడా నిలిచాయి.

 Ajith Drowned Both Mega Brothers, Ajith Kollywood, Chiranjeevi, Pawan Kalyan,-TeluguStop.com

అయితే చాలా వరకు ఇలా రీమేక్ గా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా మిక్కి మెప్పించలేకపోతున్నాయి.గల కారణం ఆ సినిమాలను అంతకుముందే ఓటీటీ లో చూడడం.

ఆల్ రెడీ రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ రీమేక్ చేస్తుండడంతో ముందుగానే సినిమాలను చూసిన ప్రేక్షకులు ఆ రీమేక్ సినిమాలను చూడడానికి అంతగా ఇష్టపడడం లేదు.

Telugu Ajith Kollywood, Bhola Shankar, Chiranjeevi, Katamarayudu, Pawan Kalyan,

అలా టాలీవుడ్ మెగా హీరోస్ కోలీవుడ్( kollywood ) స్టార్ హీరో అజిత్( Ajith ) నటించిన సినిమాలను ఇప్పటికే తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.అజిత్ తమిళంలో నటించిన వీరం సినిమాని పవన్ కళ్యాణ్ ( pawan kalyan )కాటమరాయుడిగా రీమేక్ చేసాడు.తమిళంలోనే అంతంతం మాత్రం ఆడిన ఆ సినిమాని తెలుగులో పవన్ ని రీమేక్ చెయ్యొద్దని అభిమానులు మొట్టుకున్నా ఆయన వినలేదు.

కాటమరాయుడిగా రీమేక్ చేసి బిగ్గెస్ట్ డిసాస్టర్ అందుకున్నాడు ఆయన.అలా అజిత్ పవన్ కి బిగ్గెస్ట్ ప్లాప్ ని అంటగట్టారు.2015 లో అజిత్ నటించిన వేదాళం మూవీని 8 ఏళ్ల తర్వాత తెలుగులో రీమేక్ చేసారు మెగాస్టార్ చిరంజీవి.ఆ సినిమా మరేదో కాదు భోళా శంకర్.

అరిగిపోయిన కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ భోళా శంకర్ ని మొహమాటపడకుండా తిరస్కరించారు టాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు.

Telugu Ajith Kollywood, Bhola Shankar, Chiranjeevi, Katamarayudu, Pawan Kalyan,

వేదాళం ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లోను లేదు.ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నామంటూ మెగాస్టార్ మొత్తుకున్నా వేదాళం రీమేక్ భోళా శంకర్ ( Bhola Shankar )చూసాక ఇదేం సినిమారా నాయన అంటున్నారు.అప్పట్లో అజిత్ ఛరిష్మాతో వేదాళం ఏదో ఆడేసింది.

కానీ ఇన్నేళ్లకి అదే కథతో సినిమా చేస్తే ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చలేదు.పదేళ్లకు పైగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న మెహర్ రమేష్ ఏదో పీకేస్తాడు అనుకుంటే అవుట్ డేటెడ్ కథ, స్క్రీన్ ప్లే ని కూడా కనీసం సరిగ్గా దిద్దలేకపోయారు.

కేవలం చిరంజీవి ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టిన మెహర్ మిగతా సినిమాని గాలికి వదిలేశారు.మొదటినుంచి మెహర్ రమేష్ విషయంలో అభిమానులు ఏ విషయం గురించి అయితే భయపడుతున్నారో అదే విషయం జరగడంతో తలలు పట్టుకుంటున్నారు.

దాంతో విసిగిపోయిన మెగా అభిమానులు అజిత్ సినిమాలు రీమేక్ చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పేస్తున్నారు.ఇలా రీమేక్ చేయడం బదులు కష్టపడి సొంతంగా ఒక కథ చేయడం బెటర్ అని అంటున్నారు.

ఇలా అజిత్ సినిమాలని రీమేక్ చేసి మెగా బ్రదర్స్ ఇద్దరూ మునిగిపోయారు.ఇప్పటికైనా మెగా హీరోలు మెగా సినిమాలను చేయడం ఆపేస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube